తెలంగాణాలోని వికారాబాద్ సమీపంలోని అనంతగిరి ఎప్పుడైనా సందర్శించదగిన ప్రదేశం. ఈ చల్లని ప్రదేశంలో ఉష్ణోగ్రత 18 డిగ్రీలకు మించదు.
వర్షాకాలం మొదలయ్యే సమయంలో ఇంకా సుందరంగా ఉంటుంది. జలపాతాలు, ప్రాచీన గుహలూ, మధ్యయుగం నాటి గుడులు పచ్చని అడవులూ, జలపాతాలతో ఆహ్లాదకరంగా ఉంటుంది వాతావరణం.అత్యంత ప్రాచీనమైన ప్రదేశం ఇది.
ఇక్కడి కొండలలోనే పుట్టిన ముచికుందా నది హైదరాబాద్ గుండా మొత్తం 240 కిలోమీటర్ల ప్రవహించి నల్గొండ జిల్లాలోని వాడపల్లి దగ్గర కృష్ణానదిలో కలుస్తుంది. ఇక్కడకు దగ్గరలోనే ఉన్న నాగసముద్రం సరోవరంలో పర్యాటకులకు పడవ షికారు చేసే సదుపాయం ఉంది.
హైదరాబాద్ కు సుమారు 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న అనంతగిరికి బస్ సౌకర్యం కలదు. వికారాబాద్ దాకా రైలులో వెళ్లి అక్కడనుండి బస్ ల ద్వారా వెళ్లవచ్చు.