india tour header

ఆంధ్రా కాశ్మీర్ - లంబసింగి (విశాఖపట్నం)/ Lambasingi / Summer Resort

ఆంధ్రా కాశ్మీర్ - లంబసింగి (విశాఖపట్నం)/ Lambasingi
ఆంధ్రా కాశ్మీర్  - లంబసింగి (విశాఖపట్నం)/ Lambasingi

అత్యంత చల్లని ప్రదేశం ఆంధ్రా కాశ్మీర్ గా పేరుపొందిన ప్రాంతం లంబసింగి . సముద్రమట్టానికి మూడువేల అడుగుల ఎత్తో చింతపల్లి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న చిన్న గ్రామమే లంబసింగి. డిసెంబర్, జనవరి నెలలో ఉష్ణోగ్రత మైనస్ డిగ్రీలకు పడిపోతుంది. మిగిలిన నెలలోసుమారు పది డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. సూర్యోదయం పదిగంటల తరువాతే. అరకులోయ కన్నా చల్లగా ఉండే ఈ ప్రాంతం ఎటు చూసినా పచ్చదనంతో ఆహ్లాదకరంగా ఉంటుంది.ఇక్కడున్న పొడవాటి చెట్లమధ్యలోని చల్లని వాతావరణం కారణంగా ఈ ప్రాంతంలో కాఫీ, మిరియాలు తోటల పెంపకం అటవీశాఖవారి అధ్వర్యంలో జరుగుతుంది. రకరాల పక్షుల కిలకిలా రావాలతో వాతావరణం సందర్శకులకు కనువిందుచేస్తుంది. ఇక్కడకు 27 కిలోమీటర్ల దూరంలోనే కొత్తపల్లి జలపాతం ఉంది. సందర్శకులకు చింతపల్లిలో వసతి సౌకర్యం కలదు. చింతపల్లినుండి సీలేరు ఘాట్ రోడ్ లో ప్రయాణించటం ఒక మధురానుభూతి. ఈ ఘాట్ రోడ్ లో పట్టపగలు 12 గంటలకు కూడా మంచు పడుతుంది. వేసవి సెలవులు చల్లగా గడపాలనుకునే వారికి లంబసింగి చాలా అనుకూలం. ఎలా వెళ్లాలి ? లంబసింగికి విశాఖపట్నం దాకా రైలులో వెళ్లి అక్కడ నుండి 101 కిలోమీటర్ల దూరంలో ఉన్న లంబసింగికి టాక్సీలు లేక కార్లలో వెళ్లవచ్చు. చింతపల్లికి 19 కిలోమీటర్ల దూరంలో లంబసింగి గ్రామం ఉంది. నర్సీ పట్టణానికి 32 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడనుండి టాక్సీలు లేదా కార్లలో వెళ్లవచ్చు.