india tour header

మనాలి/Manali

మనాలి ప్రసిద్ధి చెందిన హిమాలయ పర్యాటక ప్రాంతం మరియు హిమాచల్ మొత్తం పర్యాటకులలో నాల్గవ వంతు పర్యాటకులు మనాలి సందర్శిస్తున్నారు. మనాలి వాతావరణం చల్లగా, ఆహ్లాదకరంగా ఉంటుంది.
మనాలి సాహాస క్రీడలైన స్కీయింగ్, హైకింగ్, పర్వతారోహణం, పారా గ్లైడింగ్, రాఫ్టింగ్ (బల్లకట్టు పోటీలు), ట్రెక్కింగ్ (నడక), కయకింగ్(పడవ), మరియు మౌంటైన్ బైకింగ్ (పర్వత మోటార్ సైకిళ్ళ పోటీ) వంటి వాటికి పేరు పొందింది. యాక్ స్కీయింగ్ ఈ ప్రాంతపు ప్రత్యేక క్రీడ. మనాలి దాని తీవ్రమైన యాక్ క్రీడలు టైం పత్రిక యొక్క "బెస్ట్ అఫ్ ఆసియా" లో కూడా చూపబడింది మనాలిలో వేడి నీటిబుగ్గలు, మత పరమైన పుణ్య స్థానాలు మరియు టిబెట్ ఆలయాలు మరియు బుద్ద ఆలయాలు ఉన్నాయి.
గత కొన్ని సంవత్సరాలుగా మనాలి హనీమూన్ జంటలకు అభిమాన గమ్యస్థానంగా మారింది. మే, జూన్, డిసెంబర్, జనవరి లో రోజుకు సుమారు 550 జంటలు మరియు ఇతర రోజులలో రోజుకు సుమారు 350 జంటలు హనీమూన్ కోసం మనాలికి వస్తారని గణాంకాలు తెలుపుచున్నాయి.
మనాలి దాని కాంతులీనే గోమ్పాస్ లేదా బుద్ధ ఆశ్రమాలకు పేరు పొందింది. కులు లోయ మొత్తంలో టిబెటన్ శరణార్ధులు ఎక్కువగా ఉంటారు. 1969లో నిర్మించిన గదన్ తెక్చ్చోక్లింగ్ గొంప ప్రసిద్ధి చెందినఆశ్రమం. ఈ ఆశ్రమం స్థానిక సమాజం యొక్క విరాళాలు మరియు ఆలయం యొక్క కార్ఖానాలో చేతితో నేసిన తివాచీల అమ్మకాలతో నిర్వహించబడుతుంది. ప్రొద్దు తిరుగుడు పూల తోటలో, చిన్నదిగా మరియు ఆధునికంగా నిర్మించిన హిమాలయన్ న్యిన్గమప గొంప, బజారుకు దగ్గరలో ఉంది.

పర్యాటక ప్రాంతాలు
మనాలికి దక్షిణంగా ఉన్న నగ్గర్ కోట , శిలలు, రాళ్ళు, మరియు విశాల దారు శిల్పములతో కూడిన ఈ భవనం హిమాచల్ యొక్క మహోన్నత మరియు మనోహర కళా నైపుణ్యానికి తార్కాణంగా ఉంది. ఈ కోట తరువాత కాలంలో హోటల్ గా మార్చబడి ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ పర్యాటక శాఖ ఆధీనంలో ఉంది.
పాండవ యువరాజు భీముని భార్య, స్థానిక దేవత హడింబి యొక్క ఆలయమైన హిడింబా దేవి ఆలయం 1553లో స్థాపించబడింది. ఈ ఆలయం దాని నాలుగు అంతస్తుల గోపురం మరియు సున్నితమైన దారు చెక్కడాలకి ప్రసిద్ధి చెందింది.
సుందరమైన రహ్లా జలపాతములు మనాలి నుండి 27కిలోమీటర్ల దూరంలో రోహతంగ్ కనుమ ఎక్కడానికి ప్రారంభంలో 2501 మీటర్ల ఎత్తులో ఉన్నాయి.
ఉన్నాయి.

సోలంగ్ లోయ : స్నో పాయింట్ గా ప్రసిద్ధి చెందింది, మనాలికి వాయవ్యంగా 13 కిమీ దూరంలో ఉంది.
మనికరణ్ : కులు నుండి 45 కిమీ. దూరంలో మనాలి మార్గంలో పార్వతి నది సమీపంలో ఉన్న ఈ ప్రదేశం వేడి నీటిబుగ్గకు ప్రసిద్ధి చెందింది.
రోహతంగ్ మనాలి నుండి 40 కిమీ దూరంలో ఉన్న ఈ ప్రదేశం ప్రసిద్ధి చెందిన మంచు పడే ప్రాంతం, కానీ శీతాకాలంలో మంచు వలన మూయబడి ఉంటుంది. మనాలి జాతీయ రహదారి 21 మరియు జాతీయ రహదారి 1 ల ద్వారా ఢిల్లీతో కలుపబడింది, లే కు వెళ్ళే ఈ రహదారి ప్రపంచంలో అంత్యంత ఎత్తైన వాహనంలో ప్రయాణించగల రహదారిగా ప్రసిద్ధి చెందింది.
ప్రయాణ సౌకర్యాలు మనాలికి రైలు ద్వారా వెళ్ళటం కష్టసాధ్యం. సమీపంలో బ్రాడ్ గేజ్ ముఖ్య కేంద్రాలు చండీగర్ 315 కిలోమీటర్లు,పఠాన్ కోట్ (325 కిలోమీటర్లు) మరియు కాల్క (310 కిలోమీటర్లు). సమీపంలోని నారో గేజ్ ముఖ్యకేంద్రం జోగిందర్ నగర్ వద్ద ఉంది (135 కిలోమీటర్లు)
సమీపంలోని విమానాశ్రయం భున్టార్, మనాలి నుండి సుమారు 50 కిలోమీటర్లు దూరంలో ఉంది. ప్రసుతం, కింగ్ ఫిషేర్ రెడ్ ఢిల్లీ నుండి నిరంతరాయ సేవలను, ఎయిర్ ఇండియా వారానికి రెండు సార్లు సేవలను మరియు MDLR ఎయిర్ లైన్స్ ఢిల్లీకి వారానికి ఆరుసార్లు సేవలను అందిస్తున్నాయి.