header

Kotagiri Hillstation / కోటగిరి హిల్ స్టేషన్

కోటగిరి హిల్ స్టేషన్

తమిళనాడు లోని నీలగిరి జిల్లాలో కల కోటగిరి ఒక పెద్ద హిల్ స్టేషన్. దీనిని కూనూర్ మరియు ఊటీ హిల్ స్టేషన్ లతో సమానంగా చెప్పవచ్చు. మూడింటిలోను ఇది చిన్నది. అయినప్పటికి వాతావరణం పరంగా ఇది ఏ మాత్రం వాటికి తీసిపోదు.
ఈ హిల్ స్టేషన్ సముద్ర మట్టానికి 1793 మీటర్ల ఎత్తున కలదు. ట్రెక్కింగ్ చేసే వారికి మంచి ప్రదేశం. కనుక ఇక్కడ నీలగిరి లోని వివిధ భాగాలకు ట్రెక్కింగ్ లో తీసుకు వెళ్ళే మార్గాలు కలవు. ఈ లోతట్టు భాగాలలో ఇంకా మానవ నాగరికత విలసిల్ల లేదు.
కోటగిరి చుట్టుపట్లగల ప్రధాన ఆకర్షణలు
కోటగిరి లో ప్రసిద్ధి చెందిన ట్రెక్కింగ్ మార్గాలు అంటే అవి సెయింట్ కేతరినే ఫాల్స్, కోటగిరి -కోడనాద్, మరియు కోటగిరి - లాంగ్ వుడ్ షోలా మార్గాలు. అనేక చిన్న మార్గాలు కూడా కలవు. వీటినికూడా పర్యాటకులు వారి ట్రెక్కింగ్ అనుభవాన్ని బట్టి వినియోగించుకోవచ్చు. ఇక్కడ ఇంకా రంగస్వామి పిల్లర్ మరియు శిఖరం, కోదనాడు వ్యూ పాయింట్, కేతరినే వాటర్ ఫాల్స్, ఎల్క్ ఫాల్స్, జాన్ సుల్లివన్ మెమోరియల్, నీలగిరిస్ మ్యూజియం, నెహ్రు పార్క్, స్నౌదేన్ శిఖరం కూడా కలవు.
కోటల యొక్క పర్వతం
కోటగిరి చరిత్ర పరిశీలిస్తే, ఈ హిల్ స్టేషన్ ఎంతో పురాతనమైనది అయినప్పటికీ, అది బ్రిటిష్ వారు ఈ ప్రాంతాన్ని ఆక్రమించినపుడు ఎలా ఉన్నదో అలాగే ఉన్నది. కోటగిరి అంటే 'కోటల యొక్క పర్వతం' అని అర్ధం చెప్పాలి. కోటలు అనే వారు ఒక గిరిజన జాతి. వీరు ఎన్నో శతాబ్దాల నుండి ఈ ప్రాంతంలో నివసిస్తున్నారు. వీరు బయటి ప్రదేశాల వారితో మిళితం అవటానికి ఇష్టపడరు. కాలక్రమేణా వీరి జనాభా తగ్గిపోతోంది. గతంలో చివరిగా లేక్కించినపుడు వీరి సంఖ్య ఒక వేయిగా మాత్రమే.
కోటగిరి ఎలా చేరాలి ?
కోట గిరి రోడ్డు, రైలు మార్గాలతో కలుపబడి వుంది. కోట గిరి సందర్శనకు వేసవి మంచి సమయం.

Kotagiri Hill Station

Kotagiri is a major hill station located in the Nilgiri district of Tamil Nadu. It is equivalent to Coonoor and Ooty Hill stations. It's small in all three
In this place, a Christian missionary, Ralph Thomas Hutchin began translating our Vedas into English. This hill station is perched at an elevation of 1793 meters above sea level. For Trekking it is a good place for those people who loves trekking.
In the lower parts of this place human civilization is yet to be developed
Tourist places in and around Kotagiri
The trekking routes of Kotagiri are the St. Catherine Falls, Kotagiri-Kodanad, and Kotagiri-Longwood Shola routes. There are many smaller ways. Tourists can also take advantage of their trekking experience. There are also Rangaswamy Pillar and Peak, Kodanadu View Point, Catherine Waterfalls, Elk Falls, John Sullivan Memorial, Nilgiris Museum, Nehru Park, and Snouden Peak.
The mountain of castles
The history of Kotagiri, though the hill station is very old, is that the British have occupied this area and it is still in the process. Fort Giri means 'mountain of castles'. Castles are a tribal species. They have been living in this region for centuries. They do not want to be combined with outsiders. Over time, the population is declining. They were only a thousand when they finally got up.
How to reach Kotagiri
Kotagiri is well connected by road and rail. Summer is the best time to visit Kotagiri.