మహాబలిపురంను నేడు అధికారికంగా మామల్లాపురం అని పిలుస్తున్నారు. ఇది తమిళ్ నాడులోని కాంచీపురం జిల్లాలో ఉన్నది. మహాబలిపురం బంగాళా ఖాతానికి అభిముఖంగా కోరమండల్ తీరంలో కలదు.
ఈ రేవు పట్టణం 7 వ శతాబ్దంలో ఖ్యాతి గాంచిన పల్లవ రాజులు పరిపాలించారు. ఈ పట్టణం 7 వ మరియు 9 వ శాతాబ్డాలకు చెందిన అనేక స్మారక చిహ్నాలను కలిగి వుంది. దీనిని యునెస్కో సంస్థ ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది. పల్లవుల పాలనలో అంటే క్రి.శ.650 నుండి 750 వరకూ ఈప్రదేశంలో అనేక కళలు, పురావస్తు,శిల్ప సంపద,సాహిత్యం, డ్రామాలు మరియు అనేక ఇతర సాంస్కృతిక రంగాలు అభివృద్ధి చెందాయి
సంవత్సరం అంతా ఇక్కడి ఆకర్షణలు దర్శించేందుకు వచ్చే పర్యాటకులతో ఈపట్టణం కిట కిట లాడుతూ వుంటుంది.
పల్లవుల కాలంలో ఈ పట్టణం ఎంతో వైభవాన్ని చవిచూసింది. పల్లవ రాజులు ఇక్కడ కల సహజ వనరులను గ్రహించి వాటిని పూర్తిగా వినియోగించారు. వారు ఈ నగర నిర్మాణం కొరకు ఎంతో శ్రమించారు. పల్లవ రాజుల కళా తృష్ణకు మహాబలిపురం ఒక నిదర్సనంగా చెప్పవచ్చు.
సుమారు 18 వ శతాబ్దం వరకూ మహాబలిపురం ప్రాంతం గురించి బయట ప్రపంచానికి తెలియదు. దండయాత్రల భయంతో పల్లవ రాజులు తమ పట్టణ అభివృద్ధిని అంతా రహస్యంగా ఉంచేవారు. పల్లవరాజులలో నరసింహ 1 మరియు రాజసింహలు ఈ నిర్మాణాల శిల్ప నైపుణ్యతను కాపాడేందుకు అభివృద్ధికి ఎంతో శ్రమించారు.
కొండరాతి గుహలు, వెండి రంగు ఇసుక బీచ్, సరివి చెట్లు, ఇక్కడ ఉన్న దేవాలయాలు అన్నీ అద్భుతాలే. చారిత్రాత్మక పుణ్య క్షేత్రాలు, దేవాలయాలు, స్మారకాలు పర్యాటకులకు కనువిందు చేస్తాయి. కృష్ణ మండపం, పాండవుల అయిదు రధాలు, వరాహ మండపం సముద్ర తీర టెంపుల్, వంటివి ఎన్నో కలవు. టవున్ నుండి 30 కి.మీ.ల దూరంలో చోళ మండల ఆర్టిస్ట్ విలేజ్ కలదు. ఇక్కడ మనం అనేక పెయింటింగ్ లు కళా వస్తువులు, శిల్పాలు చూడవచ్చు.
ఇక్కడ ఉన్న బీచ్ మరింత శోభను చేకూరుస్తుంది. ఈ దీవిలో పర్యాటకులు ఉదయం నుండి సాయంత్రం వరకూ విశ్రమిస్తారు. టవున్ కు అయిదు కి.మీ.ల దూరంలో ఒక దుర్గ మాత టెంపుల్ కలదు. దీనిలో అనేక విగ్రహ మూర్తులు కలవు. సమీపంలోని టైగర్ కేవ్ మొసళ్ళ పార్కు కూడా ఆకర్షణీయ ప్రదేశం. ఇక్కడ పర్యాటకులు సంవత్సరం పొడవునా చూడదగిన సుందర దృశ్యాలు కలవు.
ఈపట్టణానికి సమీప పట్టణాల నుండి బస్సులలో రావచ్చు. స్థానికులతో మాట్లాడటం ఏమంత కష్టం కాదు. ఇక్కడ తమిళంతోపాటు వీరు ఇంగ్లీష్ కూడా మాట్లాడతారు.
Mahabalipuram is now officially known as Mamallapuram. This place is located in Kanchipuram district of Tamil Nadu.
This port town is ruled by the Pallava kings in the 7th century . This town has many monuments belonging to the 7th and 9th centuries. It has been declared as a UNESCO World Heritage Site. In the rule of Pallava, from around 650 to 750 AD, many arts, archeological, sculptures, literature, drama and many other cultural fields have developed. This place is crowdy with tourists who are coming to visit the attractions every year
During the Pallava period, the town experienced a great splendor. The Pallava kings realized the natural resources and used them completely. They worked hard to build this city.
Mahabalipuram was not known until the 18th century, to the world outside. With the threat of invasion the Pallava kings kept their urban development secret. In the Pallava kingdoms Narasimha 1 and Rajasimha worked very hard to develop the architectural skills of these structures.
The scenic caves, the silver sandy beach, the trees and the temples here are all wonderful. Historical pilgrimage sites, temples and monuments make it a delight to tourists.
The Krishna Mandapam, the Five Chariots of the Pandavas, the Varaha Mandapam and the Sea Shore Temple are famous. Chola Mandala Artist Village is situated at a distance of 30 km from the town. Here we can see many painting articrafts and sculptures.
The beach here is more enjoyable. Tourists can relax on the island from morning till evening. A Durga Mata Temple is located at a distance of 5 km from the town. It has many idols. The nearby Tiger Caves, Crocodile Park is also popular attractions. Tourists can see the scenic beauty of this place throughout the year.
Buses are available from nearby towns to this place. It is not difficult to talk with the locals. English is also spoken here withss Tamil.