header

Yelagiri Hill Station

ఏలగిరి

ఏలగిరి తమిళనాడు లోని వెల్లూరు జిల్లాలో ఉన్న చిన్న పర్వత కేంద్రం, పర్యాటకుల స్వర్గధామ౦. పూర్వం ఈ ప్రాంతం అంతా ఏలగిరి జమీందార్లది, ఇప్పటికీ రెడ్డియూర్ లో వాళ్ల ఇల్లు వుంది. 1950 లలో ఏలగిరి భారత సంస్థానంలో విలీనం అయింది. సముద్ర మట్టానికి 1048 మీటర్ల ఎత్తున వున్న ఏలగిరి, గిరిజనులు నివసించే 14 కుగ్రామాల సమూహం.
వివిధ గిరిజన తెగలు వుండే ఏలగిరి – తమిళనాడు లోని ఊటి, కొడైకెనాల్ లాంటి ఇతర పర్వత కేంద్రాల్లా అభివృద్ది చెందలేదు. అయితే, ఇటీవలే ఏలగిరి జిల్లా యంత్రాంగం ఈ ప్రాంతంలో పేరా గ్లైడింగ్, పర్వతారోహణలాంటి సాహస క్రీడలను ప్రోత్సహిస్తోంది. ఏలగిరిలో ప్రవేసించగానే ఎవరికైనా కనిపించేది ఇక్కడి నిశ్శబ్ద, ప్రశాంత పరిసరాలు, ఈ ప్రాంతంలో వుండే అందం. ఇక్కడి తాజా పళ్ళ ఘుమఘుమలు, రాలిన ఆకులతో ఈ ప్రాంతం నిండిపోతుంది – ఎందుకంటే ఇక్కడ పళ్ళ తోటలు, గులాబి తోటలు, పచ్చటి లోయలు వున్నాయి. ఈ మైదానాల గుండా ప్రయాణించడం చాలా బాగుంటుంది.
సాహాసాన్ని ఇష్టపడే వారు ఏలగిరి కొండలకు తప్పక వస్తారు. నిజానికి, ఇటీవలే దీన్ని మహారాష్ట్ర లోని పంచగనితరువాత రెండో ఉత్తమ సహజ క్రీడా ప్రాంతంగా గుర్తించారు. ఏలగిరిలో చాలా దేవాలయాలు వున్నాయి, ఇవి అన్ని వయసుల వారికి కూడా దీన్ని ఒక ఆకర్షణీయ పర్యాటక కేంద్రంగా తయారు చేసాయి. ఇక్కడ బోటింగ్ చేసి అందాలతో చుట్టుముట్టబడి వున్న ఈ ప్రాంతం మొత్తం చూడవచ్చు. ఇక్కడి పచ్చదనాన్ని కొండమీది నుంచి చూడవచ్చు – పర్యాటకులు టేలీస్కోప్ ద్వారా గ్రామీణ అందాన్ని చూడవచ్చు. నిలవూర్ సరస్సు బోటింగ్ చేయదగ్గ ప్రాంతాల్లో ఒకటి.
స్థల సందర్శన – రవాణా సౌకర్యాలు
వేలవన్ దేవాలయ౦, స్వామిమలై కొండ లాంటి పర్వత ప్రాంతాలు, పర్వతారోహణ లాంటి ఇతర సందర్శనీయ స్థలాలు కూడా ఇక్కడ వున్నాయి. ఇక్కడి సహజమైన పార్కులు, ప్రభుత్వ మూలికా, పండ్ల తోటలు ప్రకృతి ప్రేమికులను అలరిస్తాయి.
మీకు నక్షత్రాలను చూడడం ఇష్టమైతే, టెలిస్కోప్ హౌస్, వైను బప్పు సౌర పరిశోధనా సంస్ధ కి వెళ్ళడం మరవకండి. నవంబర్, ఫిబ్రవరి సమయంలో ఉండే శీతాకాలంలో ఏలగిరి సందర్శించడం ఉత్తమం. అయితే, సంవత్సరం పొడవున వాతావరణం ఒక మోస్తరుగా ఉంటుంది. వేసవి ఉష్ణోగ్రత 18, 34 డిగ్రీల మధ్య ఉంటుంది, అయితే శీతాకాలంలో ఉష్ణోగ్రత 11 నుండి 25 డిగ్రీల మధ్య ఉంటుంది. జులై, సెప్టెంబర్ మాసాలలో ఒక మోస్తరు వర్షపాతం ఉంటుంది. ఈ ప్రాంతంలో జనవరిలో జరుపుకునే పొంగల్ పండుగ, అక్టోబర్ లో జరుపుకునే దీపావళి పండుగ సమయంలో కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఏలగిరిలో ఈ రెండు పండుగలను ఎంతో ఉత్సాహంతో, వైభవంగా జరుపుకుంటారు. మే నెలలో మూడు రోజులు జరుపుకునే వేసవి పండుగ, కోడై విలా కూడా ఇక్కడి ప్రధాన పర్యాటక ఆకర్షణ.
ఏలగిరిని సులువుగా చేరుకోవచ్చు. ఏలగిరికి బెంగళూర్ సమీప విమానాశ్రయం. ఈ విమానాశ్రయం నుండి, ఏలగిరికి అద్దె కాబ్ లలో చేరుకోవచ్చు. చెన్నై విమానాశ్రయం కూడా ఏలగిరికి దగ్గర విమానాశ్రయం. ఏలగిరి కి జోలర్పెట్టై జంక్షన్ సమీప రైలు కేంద్ర౦, బస్సులు, కాబ్ లలో ఇక్కడికి తేలికగా చేరుకోవచ్చు. ఏలగిరికి తమిళనాడు లోని పొంనేరి నుండి రోడ్డు మార్గం ఉంది. చెన్నై, సాలెం, హోసూర్, బెంగళూర్ నుండి రోజువారీ బస్సులు అందుబాటులో ఉన్నాయి. అయితే, బస్సు ప్రయాణం నిజంగా సుదీర్ఘం, ఖర్చుతో కూడుకున్నది.
ఏలగిరికి రైలులో లేదా సొంత వాహనాలలో వెళ్లటం మంచిది. ఏలగిరి కి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలంటే మైలురాళ్ళు, సైన్ బోర్డ్ గుర్తులు మార్గాన్ని సూచిస్తాయి, పెట్రోలు బంకులు కూడా తగినన్ని ఉన్నాయి. అయితే, కొండల వద్ద ఏమీ దొరకవు కాబట్టి వెంట తీసుకువెళ్లటం మంచిది.. ఒక సీసా తేనె, జాక్ ఫ్రూట్స్ కొనుక్కొని వెళ్ళడం మరవకండి, ఎందుకంటే తమిళనాడులో మంచి తేనె ఏలగిరిలోనే దొరుకుతుంది. తేనెటీగల పెంపకంతో ఇ౦ట్లోనే తేనెని తయారుచేస్తారు. రాళ్ళపై, చెట్లపై అడవి తేనెటీగల వల్ల సహజ తేనె ఉత్పత్తి జరుగుతుంది, దీనిని స్థానికులు సేకరిస్తారు. మీరు ప్రకృతి ఒడిలో ఆనందించాలంటే అనుకుంటే ఏలగిరి మంచి విరామ స్థలం.

Yelagiri
Yelagiri Hill is one of the most popular hill stations of Tamil Nadu. Situated amidst four mountains well known for its salubrious climate prevailing throughout the year. Tribal people live in villages of these hills. Human settlement started around 200 years ago.

Travel by the winding Ghat road that has 14 hairpin bends, you can reach the Yelagiri hilltop. The ride offers panoramic breath taking views of the hills and its surroundings. The seventh bend is significant, since it offer the view of the slopes of the mountain and the green forests . The highest point in Yelgiri is the Swamimalai Hill, standing tall at 4,338 ft and a popular destination for trekkers.

Yelagiri comprises of 14 small villages. The tribal inhabitants are engaged in agriculture, horticulture, forestry etc. Their traditions, habits and the structure of their houses are very unique and attract tourist’s attention.

Ebenezer Matriculation and Higher Secondary Residential School, Peace Garden Matriculation School and Samaritan Residential School are some educational institutions cater to all categories of both Local and Outstation Students. The Don Bosco, has recently established an Arts and Science College for the benefit of local community.


Places of Interest
Punganur Lake : This is an artificial lake dug in an area of 57 sq.mt out of 12 acres lake area.

Children’s Park and Boating : A well laid out park on a 6 acre stretch of land, adjacent to the lake, is established for children centric entertainment at Yelagiri. Play equipment are installed within the park. Boating on the waters of this lake is an enchanting experience. An artificial fountain can be seen at the centre of the lake. Ticket for 4 people on paddle boat will cost Rs.75/- per 30mins.

The Yelagiri Hills Development and Tourism Promotion Society operates the Boat house at the park. Different species of Deer population is found in the Observatory area.