మోహినీ అట్టం : ఇది కేరళలో 16వ శతాబ్ధంలో ప్రాచుర్యంలో ఉన్నది. భరతనాట్యం, కూచిపూడి, మోహినీ అట్టం కూడా దేవదాసి సంప్రదాయం ద్వారా ప్రసిద్ధి గాంచాయి. స్వాతి తిరునాళ్ అనే రాజు దీనిని ఎంతగానో ప్రోత్సహించాడు.
వలత్తోల్ కవి, కళ్యాణి అమ్మ ఈ నాట్యాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చారు.
మోహినియాట్టం మహిళలచే ప్రదర్శించబడే పాక్షిక సాంప్రదాయ నృత్యరీతి. మోహిని అంటే చూసే వారినిముగ్ధలను చేయగల స్త్రీ. ఆట్టం అంటే సున్నితమైన శరీర కదలికలతో చేసే నాట్య ప్రదర్శన. జగన్మోహిని చేసే నృత్యం అని అర్థం. ఈ నాట్యంలో శృంగార రసం పాలు ఎక్కువగా ఉంటుంది
ఈ నాట్యాన్ని ప్రదర్శించే నృత్యకారిణిని చూడగానే ఆమెలో ప్రకృతి సిద్ధమైన సౌందర్యం తొణికిసలాడుతున్నట్లు కనిపిస్తుంది.
సుందరమైన భంగిమలతో, లయబద్దంగా విన్యాసాలతో, సున్నితమైన కదలికలతో చూపరులనుకట్టివేయగల చేయగల శక్తి ఈ నాట్యానికి ఉంది.
చాలా మంది 16 వశతాబ్దానికి చెందిన స్వాతి తిరునాళ్ కాలంలోనే ప్రస్తుతమున్న నాట్య రీతిని సంతరించుకుందని నమ్ముతున్నారు. ట్రావెంకూర్ మహారాజు గొప్ప కళా ప్రియుడు. ఆయన దేశ వ్యాప్తంగా ఉన్న గాయకుల్ని, నృత్య కళాకారుల్ని తన సభకు ఆహ్వానించి ప్రదర్శనలు ఏర్పాటు చేసేవాడు.
ఇదే కాలంలో ఆయన తమిళనాడు కు చెందిన తంజావూరు ప్రాంతం నుంచి భరతనాట్య శిక్షకులని ఆహ్వానించాడు. వీరితో పాటు వచ్చిన కళాకారులు అప్పటికే అక్కడ ఉన్న ప్రాంతీయ నృత్యంపై తమ ప్రభావం చూపడం వలన మోహియాట్టం ప్రస్తుత స్థితిని పొందినట్లు తలంచుచున్నారు. అంతే కాక ఆయన గొప్ప పద్మనాభుని భక్తుడు. పద్మనాభునిపై హిందుస్తానీ, మరియు కర్ణాటక సంగీత కృతులను, పదాలనూ, వర్ణాలనూ కూర్చాడు. మోహినీయాట్టం నృత్య ప్రదర్శనలో పద్మనాభుని పదాలు, వర్ణాలు సర్వ సాధారణం.
Mohiniyattam is a classical Indian dance and this popular dance evolved in Kerala in the 16th century. Mohiniattam dance will be performed by female.
Mohini means a woman steals the hearts of viewers. The movements of dancers are graceful and they wear attractive costumes. Karnataka vocal music will be played in Mohiniattam dance.
The dancers wear white and gold dress. In traditional style hair is gathered a side and adorned with jasmine
Bharatanatyam, Kuchipudi and Mohiniattam are get very famous through Devadasi tradition. King Swati Tirunal , greatly encouraged this art.
Valththal poet and Kalyani Amma brought this dance to the public prominence.
This traditional solo dance performed by women after getting perfect training.
Generally these dancers are having natural beauty and pleasant structure
This dance has the power to be able to impress the viewers with beautiful scenes, rhythmic and sensitive movements.
Many believes this dance is formed in 16th centuary at the time Swathi Thirunal
The Maharaja of Travancore is a great artist. He invites singers and dancers throughout the country to his courtyard and arranges to play their art.
During the same period he invited the Bharatanatyam artists from Thanjavur, Tamil Nadu.
This king is a great devotee of Lord Padmanabha. He composed the works of Hindustani and Carnatic music on Padmanabha.
Padmanabhuni padalu are common in Mohanayattam dance performance.