Food for 1 – 5 years Children…1-5 సంవత్సరముల లోపు పిల్లల ఆహారం : డా. జానకి,నూట్రిషినిస్టు, హైదరాబాద్
మొదటి అయిదు సంవత్సరాలు పిల్ల జీవితంలో చాలా ముఖ్యమైనవి. అప్పుడు శారీరకంగా ఎదుగుదల బాగుంటుంది. జీర్ణవ్యవస్థ చురుగ్గా పనిచేస్తుంది. రోగనిరోధకశక్తి కూడా పెరుగుతుంది. పిల్లలు పొడగవుతారు. బరువు కూడా పెరుగుతారు. ఇలాంటి సమయంలో తల్లిదండ్రులు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేమిటో తెలుసుకుందాం.
ఈ వయసు పిల్లల్లో ఏకాగ్రత తక్కువ. ప్రతి పదినిమిషాలకు వారి దృష్టి వేరే వాటి మీదికి మరలిపోతుంది. అందుకే తల్లిదండ్రులు పిల్లలకు 20 నిమిషాలోపు అన్నం తినిపించాలి.
ఆకలేసినప్పుడే పిల్లలకు అన్నం పెట్టాలి. ఆకలి కాకుండానే అన్నం పెడితే వారు సరిగా తినరు.
తిండి విషయంలో పిల్లలను వారి స్నేహితుతో ప్చోవద్దు. పిల్లలకు ఏది ఇష్టమో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. వాళ్ళ స్నేహితులు ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ తెచ్చుకుంటారో అడిగి తెలుసుకుంటే మంచిది. అలా చేస్తే ఫుడ్‌కి సంబంధించి పిల్లల ఇష్టాఇష్టాలు ఏమిటో తల్లితండ్రులకు తెలిసే అవకాశం ఉంటుంది.
అన్నం తింటే నీకు చాక్లెట్ పెడతాను. బిస్కట్ ఇస్తాను అన్ని తల్లులు పిల్లనును ఆశపెడుతుంటారు. ఇది మంచి పద్ధతి కాదు. మెనూ ప్లానింగ్‌లో పిల్లలు పాలుపంచుకునేలా చేయాలి. ఎలాంటి ఫుడ్ ఐటమ్ వారికి ఇష్టం, ఎలాంటివి ఇష్టం లేదు తెలుసుకుని తదనుగుణంగా మెనూ టైమ్ టేబుల్ తయారుచేసి పిల్లలకు పెట్టాలి.
పోషకాహార లోపం ఉన్న పిల్లలు దేన్నీ తింటానికి తొందరగా ఇష్టపడరు. అలాంటి వారికి తగిన సప్లిమెంట్లు ఇప్పించాలి. అప్పుడు వారిలో పోషకాహార సమస్యలు పోయి ఆకలివేయడం, తిండి పట్ల ఆసక్తి రెండూ పెరుగుతాయి.
సాధారణంగా ఈ వయసు పిల్లలు రోజు మొత్తంలో కొన్ని సమయాల్లో ఇంట్లో లేదా స్కూల్ లేదా క్రచ్‌లో ఉంటారు. తల్లితండ్రు పిల్లలు తినే వేళ పట్ల శ్రద్ధవహించాలి. సమయానికి వారికి ఆహారం తినటం అలవాటుచేయాలి. అన్నం తినే వేళు సరిగ్గా పాటిస్తే పిల్లలు ఎప్పుడూ హుషారుగా, ఎనర్జిటిక్‌గా ఉంటారు.
ఒకేసారి పిల్లలకు ఎక్కువ అన్నం పెట్టేయకండి. అలా పెడితే వారి కడుపు అరాయించుకోలేదు.పసివాని బొజ్జలో ఒకసారి 250 ఎం ఎల్ కన్నా మించి ఎక్కువ ఆహారం పోదు.
పోషకపదార్థాలు పుష్కలంగా ఉండే ఆహారాన్ని పిల్లలకు పెట్టాలి. ఇలాచేస్తే పోషకాహార లోపం రాదు. చిక్కి, డ్రైఫ్రూట్స్, మిల్క్‌షేక్స్, నట్ హల్వా, నువ్వుల లడ్డు, పీనట్స్, వెన్నపూసిన చపాతీలు, ఎగ్ ఆమ్లెట్ కలిపిన చపాతీలు, దోసె వంటివి ఈ వయసు పిల్లలకు పెట్టాలి.
పిల్లలకు అన్నం కలిపి పెట్టవద్దు, వారికి వారే ఆహారం కలుపుకుని తినేట్టు అలవాటు చేయాలి.
తిండి ప్రాధాన్యత పిల్లలకు అర్థమయ్యేలా తెలియచెప్పాలి.
పిల్లలకు ఇష్టమైన చాక్లెట్లు, పిజ్జాల లాంటివి తినొద్దని కట్టడి చేయకండి. అదే సమయంలో చాక్లెట్‌తో పాటు ఒక పండు కూడా పిల్లలచేత తినిపిస్తే వారి ఆరోగ్యానికి చాలా మంచిది.
పిల్లలకు పెట్టాల్సినవి
ఉదయం 6 గంటకు పాలు, 2 బాదం పప్పులు
ఉదయం 8 గంటకు చట్నీ లేదా సాంబారుతో ఇడ్లీ లేదా ఎగ్ దోసె.
ఉదయం 11 గంటకు అరటిపండు లేదా ఇతర పండ్లు
మధ్యాహ్నం 1 గంటకు నెయ్యి వేసిన పప్పు అన్నం, పెరుగు అన్నం
3 గంటకు నువ్వు లడ్డు లేక పల్లీ పట్టీ
సాయంత్రం 5 గంటలకు ఏదైనా పండు
సాయంత్రం 7 గంటలకు రాజ్మా లేదా వెజిటబుల్ కర్రీతో చపాతీ
రాత్రి పడుకోబోయే ముందు గ్లాసుడు పాలు, 2 ఖర్జూర పండ్లు