header

Food for growing children…ఎదిగే పిల్లలకు చిరుతిండ్లు

క్యారెట్‌ పాయసం క్యారెట్లను బాగా ఉడకపెట్టి గుజ్జుగా చేసి పాలలో కలిపి, చక్కెర వేసి, యాలకుల పొడి వంటివి వేసి చక్కటి పాయసం తయారు చేసుకోవచ్చు. అన్నంలో పెసరపప్పులేదా శెనగపప్పు వంటివి కలిపి చేస్తే పోషకాలు ఎక్కువగా అందుతాయి.
పుడ్డింగ్‌ పాలు, కోడిగుడ్లు, చక్కెర ఈ మూడు తగిన పాళ్లలో కలిపి దానికి యాలకుల పొడి వంటివి కలిపి ఇడ్లీకుక్కర్‌ లో పెట్టి ఆవిరిమీద ఉడకబెడితే చక్కటి జున్నులాంటి పుడ్డింగ్‌ తయారవుతుంది. దీనిలోనే బ్రెడ్‌ ముక్కలు కూడా తోడు చేస్తే బ్రెడ్‌ పుడ్డింగ్‌ సిద్ధం దీన్నుంచి శక్తి కూడా ఎక్కువగా అందుతుంది.
ఫ్రూట్‌ కస్టర్డ్‌ : చాలామంది బజారులో దొరకే క్లస్టర్డ్‌ పౌడర్‌ తెచ్చుకోవాలని భావిస్తుంటారు గానీ పాలను చిక్కగా మరిగించి ఇంకా కావాలంటే చిక్కదనరం కోసం దానిలో కొద్దిగా మొక్కజొన్న పిండి కలిపి సువాసనకోసం కొద్దిగా ఎస్సెన్స్‌ కలిపి సెగమీద కొంతసేపు ఉంచిన తరువాత దానిలో రకరకా పండ్లముక్కను కలిపి చక్కటి క్లస్టర్డ్‌ ఇవ్వవచ్చు.
పిల్లలకు పండ్లు తప్పనిసరి. వీటిని తినిపించటానికి ఇది తేలికైన పద్ధతి. విడిగా ఇస్తే ఒక్క అరటిపండు తినిపించడమే గగనం. కానీ ఈ క్లస్టర్డ్‌లో ఆపిల్‌ అరటి మామిడివంటి చాలా రకాలు కలిపి ఇవ్వవచ్చు.
మిల్క్‌షేక్‌ ఆడుకోవటానికి ఉరుకుతుంటే పిల్లలను పట్టుకుని వాళ్ళచేత నాలుగు సపోటాలు తినిపించాంటే మహా కష్టం. కానీ అదే సపోటాను పాలో వేసి మిల్క్‌షేక్‌లా తయారు చేసి చేతికిస్తే హాయిగా ఇష్టంగా క్షణాల్లో తాగేస్తారు. సపోటానే కాదు. అరటి, మామిడి స్టాబెర్రీ వంటివన్నీ కూడా ఇలాగే ఇవ్వవచ్చు.
జావ జావ తాగటమంటే అదేదో ముసలివాళ్ల వ్యవహారమన్న ధోరణి ఒకటి పాతుకుపోయింది. ఇప్పుడిప్పుడే ఇది మారుతోంది. నిజానికి ఆరోగ్యానికి చక్కటి పునాది అవసరమైనది చిన్నతనంలోనే రాగి జావ, సజ్జ జావ వంటివి తయారు చేసినప్పుడు వాటిలో మామిడి రసం, అరటి గుజ్జు,అనాస గుజ్జు వంటివి కలిపి ఇస్తే ఇష్టంగా తాగుతారు.
రాగి లడ్డులు సాధారణంగా ఇంట్లో నిల్వ చేసుకునే చిరుతిండ్లన్నింటినీ కూడా బియ్యం పిండి, గోధుమపిండి, శెనగపిండి వంటి వాటితోనే చేస్తారు. కానీ ఇవే కాకుండా రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రల వంటి వంటివి కూడా వాడుకుంటూ చాలా రకాల వంటలు చేసుకోవచ్చు. సాధారణంగా బియ్యంతో చెయ్యటానికి వీలైన పదార్థాలన్నింటినీ కూడా వీటితో తయారు చెయ్యవచ్చు. రాగిపిండిని ఒక బట్టమీద పోసి కొద్దిగా తడిపి దాన్ని ఆవిరి మీద కొద్దిసేపు ఉడికిస్తే ఉండ వచ్చేలా తయారవుతుంది. దాన్ని బెల్లం పాకంలో వేసి దాన్లోనే వేయుంచిన పల్లీ పొడి వంటివి కలిపి ఉండలా చేసే చక్కటి రాగి లడ్డూలు సిద్దమవుతాయి. ఆరోగ్యానికి ఇవి ఎంతో మంచివి కానీ జావలాగా తాగాంటే దానిలో 2-3 చెంచా కంటే ఎక్కువ రాగిపిండి పట్టదు. అందుకని ఇలా లడ్డూల వంటివి చేసుకుని వివిధరూపాల్లో తింటే మంచిది.
రాగిపిట్టు కేరళ తదితర రాష్ట్రాలో రాగిపిట్టు చాలా ఇష్టంగా తింటారు. కుక్కర్‌లో దీన్ని తేలికగానే తయారు చేయవచ్చు. కుక్కర్‌లో అన్నం తదితరాటు పెట్టే గిన్నెను తీసుకుని దానిలో అడుగు వరసన రాగిపిండి, దానిపైన కొబ్బరి తురుము, మళ్ళీ దానిపైన చక్కెర లేదా బెల్లం వంటివి పొరలు పొరలుగా (కలపకుండా) వేసి ఆవిరి మీద ఉడికించి దాన్ని ముక్కలుగా కూడా కోసుకుని తినవచ్చు. దీనిలో పిల్లలకు కావాల్సిన పోషకాల శక్తి వంటివన్నీ లభ్యమవుతాయి.
కూరపకోడీలు ఉల్లి పకోడీలనేవి మామూలే గానీ, పాలకూర, తోటకూర, క్యాబేజీ, క్యాలీఫ్లవర్‌ వంటివి కలిపి వెజటబుల్‌ పకోడి వంటివి చేస్తే మంచిది. పునుగులలో కూడా ఆకుకూరలు, నానబెట్టిన శెనగపప్పు, పెసరపప్పు వంటివి కలిపి వెయ్యవచ్చు. వీటిలోనూ క్యారెట్లు, ఆకుకూరలు, క్యాబేజీ వంటి కాయగూర ముక్కలు దండిగా కలపవచ్చు.