Lice.....పేల నివారణ
పేలనుండి ఉపశమనం పొందటానికి మార్కెట్లో చాలా షాంఫూలు లభిస్తున్నాయి. కాని అవి రసాయనాలతో తయారు చేయబడినవి. అలా కాకుండా సహజసిద్ధంగా దొరికే పదార్థాలతో పేల బాధ తగ్గించుకోవడానికి కొన్ని చిట్కాలు :
రెండు టేబుల్ స్పూన్ల వెనిగర్ కు అంతే మోతాదులో నీరు కలిపి ఆ మిశ్రమాన్ని తలకు రాసి ఆరనివ్వండి. సరిగ్గా గంట తరువాత కుంకుడు కాయరసంతో తలస్నానం చేయాలి.
ఒక కప్పు కొబ్బరినూనెలో టీస్పూన్ కర్పూరం పొడి కలపాలి. ఆ పొడి కరిగిపోయేదాకా కొబ్బరినూనెను వెచ్చబెట్టండి. గోరువెచ్చగా నూనెను మాడుకు అంటేలా శుభ్రంగా మర్థనా చేయాలి. ఒక గంటతరువాత కుంకుడు కాయల రసంతో స్నానం చేయాలి.
గుప్పెడు తులసి ఆకులు తీసుకొని నూరి రాత్రి నిద్రపోయేముందు తలకు అంటేలా రాసుకోండి. తర్వాత వెంట్రుకలు కనిపించకుండా తలకు మెత్తని వస్ర్తం కట్టుకొని పడుకోండి. తెల్లారి లేచిన తరువాత పేల దువ్వెనతో దువ్వండి.
రాత్రి పడుకోబోయే ముందు ఆలివ్ నూనెను తలకు బాగా పట్టించి తర్వాత ఒక ప్లాస్టిక్ సంచిని తలకు చుట్టుకొని పడుకోండి. తెల్లారిన తరువాత పేల దువ్వెనతో శుభ్రంగా దువ్వండి
వారానికి ఒకసారి ఇలా చేస్తే పేలబాధనుండి విముక్తి పొందవచ్చు.