
అమెరికాకు చెందిన యూఎమ్ ఇంటర్నేషన్ ఆటోమొబైల్ కంపెనీ రెనెగేడ్ కమాండో క్లాసిక్, కమాండో మొజావే పేరుతో రెండు మోడళ్లను విడుదల చేసింది.
క్రూయిజర్ బైక్ హర్లే డేవిడ్సన్ డిజైన్ స్ఫూర్తితో ఈ బైక్ని రూపొందించారు. కిందికి దిగిన డ్రైవర్ సీటు.. విశాలమైన హ్యాండిల్బార్లు.. గుండ్రని హెడ్ల్యాంప్లతో డిజైన్ స్టైలిష్గా ఉంది. సెల్ఫోన్ని ఛార్జింగ్ చేసుకునేలా స్పాట్ మిర్రర్ దగ్గర ఓ యూఎస్బీ పోర్టును సైతం అమర్చడం ఈ బైక్ ప్రత్యేకత. మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి యువతను దృష్టిలో ఉంచుకొని రూపొందించిన ఈ మోడల్లోని మరిన్ని ప్రత్యేకతలు.
సామర్థ్యం: 279.5సీసీ
ఆయిల్: పెట్రోల్
ేర్లు: ఆరు
ఇంధనం నిల్వ: 18లీటర్లు
గరిష్ఠ వేగం: 125కిమీలు,
మైలేజీ: 25-30కిమీ/గం
ధర: రూ.1,89,000
(ఎక్స్ షోరూం దిల్లీ)