
యువత మెచ్చే మరో బైక్ స్క్రాంబ్లర్ మాక్ 2.0. ఆటోమొబైల్ మార్కెట్లోకి వచ్చింది. డుకాటీ రూపొందించిన స్క్రాంబ్లర్ మాక్ 2.0 ప్రత్యేకతలు.
1965లో వచ్చిన మాక్ 1250 స్ఫూర్తితో డుకాటీ ఈ మోడల్ని రూపొందించింది.
ఇంతవరకు ఏ బైక్లకూ వాడని షైనింగ్ బ్లాక్ రంగు దీని ప్రత్యేకం అంటున్నారు.
803సీసీ ఎల్ ట్విన్ ఇంజిన్, సిక్స్ స్పీడ్ గేర్బాక్స్తో పనిచేస్తుంది.
కాలిఫోర్నియాకు చెందిన ప్రఖ్యాత రొనాల్డ్ శాండ్స్ దీన్ని డిజైన్ చేశాడు.
అల్యూమినియం హ్యాండిల్బార్లు, ఫ్లాట్ ట్రాక్ ప్రొ సీటు, సిలిండర్ హెడ్కవర్లు, రేసింగ్ బైక్ స్టైల్ అదనపు హంగులు.
గంటకు 160కిమీల అత్యధిక వేగంతో దూసుకెళ్లే ఈ ద్విచక్రవాహనం ధర.రూ 8.52లక్షలు (ఎక్స్ షోరూం ధర)