
28 km per litre
5-8 lakhs
మొదటి, రెండో జనరేషన్కి డిజైన్ విషయంలో పెద్దగా మార్పుల్లేవు. మూడో జనరేషన్ మాత్రం పూర్తి విభిన్నంగా, మరింత ఆధునికంగా కనిపిస్తోంది. షట్కోణ ఆకారంలో ఉన్న పెద్ద గ్రిల్తో ఆకారమే పూర్తిగా మారిపోయింది. ముందూ, వెనకా పూర్తి డీఆర్ఎల్ ఎల్ఈడీ లైట్లు ఆకర్షణీయంగా ఉన్నాయి. గతంలో పద్నాలుగు అంగుళాలు ఉన్న టైర్ల సైజును మరో అంగుళం పెంచారు.
భద్రత భేష్
హ్యాచ్బ్యాక్, కాంపాక్ట్, సెడాన్ విభాగాల్లో పోటీ పడుతున్న స్విఫ్ట్లో ఈ రేంజ్లో భద్రతాపరమైన అంశాలకు మంచి ప్రాధాన్యం ఇచ్చారు. రెండు ఎయిర్బ్యాగ్లు.. యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఈబీడీ, పిల్లల ప్రయాణానికి అనువుగా ఉండే చైల్డ్ సీట్ రిస్ట్రైన్స్, వాతావరణాన్ని నియంత్రించే ఆటో క్లైమేట్ కంట్రోల్, ప్రమాదాల్ని నివారించే రేర్ పార్కింగ్ సెన్సర్లు సేఫ్టీ అంశాలు. రివర్స్ కెమేరా, నావిగేషన్, ఆండ్రాయిడ్ ఆటో, యూఎస్బీలు, యాక్జిలరీ సాకెట్లు.. ఇతర ఫీచర్లు.
ఆకట్టుకునే సౌకర్యాలు
స్టీరింగ్, డాష్బోర్డ్, కన్సోల్, సీట్లు.. ప్రతీదీ నాణ్యతకు పెద్దపీట వేయడంతో ఇంటీరియర్ స్పోర్ట్లుక్తో స్టైలిష్గా కనిపిస్తోంది. డిజైన్ మార్పులో భాగంగా 30మిమీలు ఎత్తు తగ్గించి, 40మిమీల వెడల్పు పెంచడంతో లోపల లెగ్రూం, హెడ్రూం విశాలంగా ఉన్నాయి. గత మోడల్లో బూట్స్పేస్ 204లీటర్లే ఉండేది. ఆ కొరత తీర్చడానికి 268లీటర్లకు పెంచారు. రెండు పెద్ద బ్యాగ్ల్ని సైతం తేలికగా పెట్టుకోవచ్చు. అత్యాధునిక ఏడంగుళాల ఇన్ఫోటైన్మెంట్ తెరని ఆండ్రాయిడ్, ఆపిల్ ఫోన్లతో అనుసంధానం చేసుకోవచ్చు.
గత మోడల్తో పోలిస్తే ఇంజిన్లో ఎలాంటి మార్పు లేదు. 1248 సీసీ సామర్థ్యం, నాలుగు సిలిండర్లు, 1.2కె సిరీస్ మోటార్.. హైవేలు, ఇరుకు రోడ్లుపై సైతం తేలిగ్గా గేర్లు మార్చడానికి అనువుగా ఏఎంటీ గేర్బాక్స్ ఉంది.