వాము ఆకులు మంచి వాసన కలిగి ఆకు చాలా మందంగా ఉంటుంది, మంచి గుణాలు కలది. వాము మొక్కలను పెరట్లో సులభంగా పెంచవచ్చు. వీటి కొమ్మలను తుంచి మట్టిలో గుచ్చినా చక్కగా పెరుగుతుంది. వాము మొక్క కాండం పెళుసుగా ఉంటుంది. వాము ఆకును పచ్చిగా తినవచ్చు. వాము ఆకులతో బజ్జిలు చేస్తారు,.
వాము ఆకులో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అజీర్తి, గ్యాస్, కడుపు ఉబ్బరం సమస్యలు, మలబద్దకం వంటి సమస్యలను తగ్గించటంలో వాము ఆకులు చక్కగా పనిచేస్తుంది.
వాము ఆకులను నమిలితే జీర్ణ సమస్యల నుంచి బయట పడవచ్చు. గ్యాస్ట్రిక్ జ్యూస్‌లను విడుదల చేయడంలో వాము ఆకు సహాయం చేస్తుంది. వికారం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలకు వాము ఆకు చక్కగా ఉపయోగపడుతుంది.
చిన్న పిల్లల్లో వచ్చే దగ్గు, జలుబు వంటి సమస్యలను తగ్గిస్తుంది. వాము ఆకులో యాంటీ సెప్టిక్ లక్షణాలు ఉండుట వలన గాయాలు, మచ్చలను తగ్గిస్తుంది. వాము ఆకు పసుపు లాగా పనిచేస్తుంది.
చిన్నపిల్లల్లో వచ్చే కడుపునొప్పికి వాము ఆకు మంచి మందు అని చెప్పవచ్చు. ప్రతి రోజు భోజనం అయ్యాక వాము ఆకును తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
చిన్న పిల్లలకు వాము ఆకు రసంలో తేనే కలిపి ఇస్తే వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. అలాగే దగ్గు,జలుబు వంటివి రాకుండా నిరోధించవచ్చు.