కలబంద ఎన్నో ఔషధ గుణాలు కలిగిన గుబురుగా పెరిగే మొక్క కుండీలలోనూ, నేలపైన పెంచవచ్చు. కలబంద ఆకులలో 94 శాతం నీరు ఉంటుంది, గుజ్జులో సుమారు 20 రకాల ఆమోనో ఆసిడ్లు, కార్భోహైడ్రేట్లు మరియు ఇతర రసాయన బార్భలోయిన్ అనే గ్లూకో సైడులు ఉంటాయి. చాలా ఉపయోగాలు ఉండటం వలన ఎక్కువ విస్తీర్ణంలో వాణిజ్య పంటగా కూడా వేస్తున్నారు.
కలబంద ఆకులను మెత్తగా నూరి రసం తీసి దానిని పుండ్లు ,కురుపులపై పూతగా వాడవచ్చు
కలబంద అంతగా ముదరని ఆకులను తీసి వాటిని చీల్చి గుజ్జు లాంటి పదార్థానికి చిటికెడు ఉప్పు , పసుపు కలిపి 15 రోజుల పాటు ఒక్కసారి చొప్పున తీసుకుంటే జీర్ణ కోశంలోని సూక్ష్మ క్రిములు చనిపోతాయి.
కలబంద గుజ్జుతో అనేక ఔషధాలు తయారు చేస్తున్నారు. అలోవేరా జ్యూస్, సౌందర్యసాధనాలు మొదలగునవి
జీర్ణ శక్తిని పెంపొందిస్తుంది
క్లోమ గ్రంధిని శుద్ధి చేస్తుంది
కాలేయ విధులను సక్రమం చేస్తుంది
రక్తం శుభ్రపడుతుంది
వ్యాధి నిరోధక శక్తిని పెరుగుతోంది
నేత్ర రోగాలలో, కాలిన గాయాలు దీర్ఘకాలిక పుండ్ల నివారణకు, ప్లీహము, కాలేయం మూత్ర కోశ సంబంధ వ్యాధులలోనూ, గర్భాశయ రుతు సంబంధ చికిత్సలకు ఉపయోగపడుతుంది.
ఆకులనుండి తీసిన 'ఆలోయిన్'ను ఎండబెడితే ముసాంబరం అనే నల్లని పదార్థం తయారవుతుంది. ఇది నొప్పులను, వాపులను తగ్గిస్తుంది
కలబంద మట్ట పైతోలును తొలగించి జెల్ లాంటి పదార్ధాన్ని మంచినీటిలో కడిగి, రెండుస్పూన్ల మోతాదులో తీసుకుని, కొద్దిగా అల్లం ముక్కను వేసి, కొద్దిగా నీరుకలుపుకుని మిక్సీలో జ్యూస్ చేసుకుని వడకట్టుకుని, కొద్దిగా నీళ్లు, నిమ్మరసం, ఒక చెంచా తేనె కలుపుకుని తాగవచ్చు.