ఇంటి పెరడులో పెంచగలిగిన దీర్ఘకాలిక చెట్టు. దీని ఆకులలో ఔషధ గుణాలు, పండులో పోషకాలు ఎక్కువగా ఉన్నాయి.
పంటినొప్పికి 5-6 తాజా ఆకులను అర లీటరు నీటిలో 5 నిముషాలు ఉడికించి వడగట్టి రోజుకు మూడు సార్లు పుక్కిలి పట్టాలి. లేదా 4-5 తాజా ఆకులను కొద్దికొద్దిగా నీరు పోస్తూ మెత్తగా నూరి దానిని నొప్పిని కలిగిస్తున్న దంతాలపై రోజుకు రెండు సార్లు చొప్పున మూడు రోజులు ఆ విధంగా చేయాలి. పంటి నొప్పి, చిగుర్ల వ్యాధులు తగ్గుతాయి.
2,3 ఆకులను నమిలితే దంతాలు శుభ్రపడతాయి. దృఢత్వం కూడా వస్తుంది.
చెట్టు బెరడు నుండి తీసిన కషాయం సూక్ష్మజీవులను నశింపజేస్తుంది. 5,6 ఆకులను నీటిలో మరగ కాచిన కషాయం వాడితే దగ్గు, జలుబు తగ్గుతుంది.
ఆకుల నుండి లభించే తైలం యాంటి ఆక్సిడెంట్ల చర్యలను వేగవంతం చేస్తుంది. ఆకులతో తయారైన మందులు డయేరియా, డిసెంట్రీలకు (విరోచనాలకు) మంచి ఫలితాన్నిస్తాయి.
బాగా మాగిన పండును రోజూ తీసుకుంటే రక్తపోటు నియంత్రణలో వుంటుంది. ఎసిడిటి కలవారు కూడా రోజుకో పండును వాడితే మంచిది.
పచ్చి కూరగాయ ముక్కలతో పాటు జామకాయ ముక్కలను కలిపి వాడితే ఊపిరితిత్తుల వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి దోహదం చేస్తుంది.
ఇందులోని కెరొటినాయిడ్స్, ఐసోఫావో నాయిడ్స్, పాలిఫినాల్స్ మెదడు కణాలు చురుకుగా పనిచేయడానికి తోడ్పడతాయి.
కాలిన గాయాలకు గుజ్జును రాస్తే తొందరగా ఉపశమనం కలుగుతుంది. డైటింగ్ చేసేవారికి జామపండు బలవర్ధక ఆహారం. జామ చెట్టుకు పురుగు మందులు కానీ, బలం మందులు కానీ వేయరు. ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన పండు జామపండు. మధుమేహులు నిరభ్యంతరంగా తినగలిగినవి జామకాయలు (దోరకాయలు)