నేలవేమును కుండీలలో కూడా పెంచుకోవచ్చు. ఈ చెట్టు ఆకులు, కాండంలోనూ ఔషధ గుణాలు ఎక్కువగా ఉన్నాయి. దీని ఆకులు వేప ఆకుల కంటే చేదుగా ఉంటాయి. అందుకే దీనిని ‘కింగ్ ఆఫ్ బిట్టర్స్’ అని అంటారు. దీని శాస్త్రీయనామం ఆండ్రో గ్రాఫిస్ పానిక్యలేటా. సంస్కృతంలో కాలమేఘ అని అంటారు.
వైరల్ జ్వరాలు, విషజ్వరాలు తగ్గించటంలో దీని ప్రయోజనం చాలా ఎక్కువ. రెండు స్పూన్ల ఈ ఆకుల రసం రోజుకు రెండుసార్లు తీసుకుంటే జ్వరాల నుండి ఉపశమనం లభిస్తుంది.
సాధారణమైన జలుబు, జ్వరాలకు, మలేరియాకు ఇది మంచి మందంటారు.
నేలవేము పొడి ఆయుర్వేద దుకాణాలలో లభిస్తుంది. 1 నుండి 2 చెంచాల చూర్ణాన్ని నీళ్లలో కలుపుకుని కొన్ని వారాల పాటు తీసుకుంటుంటే మధుమేహవ్యాధి అదుపులో ఉంటుందంటారు.
ఇంకా కాలేయవ్యాధులు, చర్మవ్యాదులకు కూడా ఈ చూర్ణంతో చికిత్స చేస్తారు. దీనిని సర్వరోగ నివారిణి అని కూడా పిలుస్తారు.
ఈ మొక్కలు కొద్దిపాటి నీడలో చక్కగా పెరుగుతాయి. ఒకసారి విత్తనాలు నాటుకుంటే, తరువాత విత్తనాలు పడి అవి పెరుగుతాయి.
దీనిని వాడేముందు మీకు దగ్గరలో ఉన్న ఆయుర్వేద వైద్యులను తప్పనిసరిగా సంప్రదించండి.