చాలామందికి ఈ మొక్కల గురించి తెలియక పోవచ్చు. ఈ మొక్కల ఆకులు రక్తంలో ఇన్సులిన్ స్థాయిని పెంచి మధుమేహాన్ని అదుపులో ఉంచుతాయంటారు. ఇన్సులిన్ ను అందించగలదు కాబట్టే ఇన్సులిన్ మొక్క అని పేరు వచ్చిందంటారు. దీని శాస్త్రీయ నామం కాప్టస్ ఇగ్నేయస్ (Costus Igneus). రక్తంలో చక్కెరను అతి తక్కువ సమయంలో తగ్గిస్తుందంటారు. ఈ మొక్కల గురించి ఎక్కువమందికి తెలియక పోవచ్చు. పేరుపొందిన నర్సరీలలో కానీ, మూలికా వైద్యనిపుణులను కానీ అడిగి తెలుసుకోవచ్చు.
గర్భిణీ స్త్రీలు, పిల్లలకు పాలిచ్చే తల్లులు ఈ ఆకులను తినకూడదంటారు. మధుమేహంతో భాదపడుతన్నవారు కూడా డాక్టర్ ను సంప్రదించి ఈ ఆకులను తినటం మంచిది.ఉదయం ఒక ఆకు సాయంత్రం ఒక ఆకు మాత్రం ఖాళీ కడుపుతో తింటే సరిపోతుంది.