కిడ్నీలో ఏర్పడిన రాళ్లను కరిగించడం కోసం కొండపిండి ఆకును ఉపయోగిస్తున్నారు . కొండను కూడా పిండిచేసే చెట్టు కనుక కొండపిండి ఆకు అని పేరు వచ్చిందంటారు.
కిడ్నీలో రాళ్లు ఏర్పడినట్లు నిర్దారణ కాగానే కొండపిండి ఆకు రసం త్రాగడం మొదలు పెట్టాలి. ఉదయం పూట పరిగడుపున కొంత కొండపిండి ఆకును తీసుకొని దంచుకొని లేదా మిక్సిలో వేసి 10 యం.యల్ రసం తయారు చేసుకొని అందులో టీ స్పూన్ జీలకర్ర, పటికబెల్లం పొడి కలుపుకుని (మధుమేహం వారు పటికబెల్లం కలపకుండా తాగాలి) తయారు చేసుకొని కలుపుకొని 5 రోజుల పాటు సేవిస్తే 15 రోజుల లోపల రాళ్లు కరిగి పోవడం లేదా రాళ్లు పడిపోవడం జరుగుతుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్టులేని ఈ రసంతో చాలా మందికి రాళ్లు పడిపోవడం, కరిగిపోవడం జరుగుతుంది.
మూత్ర సంభందిత వ్యాధులు కూడా కొండపిండి ఆకులు రసం కొన్నిరోజులపాటు తీసుకోవటం వలన తగ్గుతాయి. ఈ ఆకుల రసాన్ని ఎక్కువ రోజులు సేవించకూడదు. అవసరం ఉన్నప్పుడే దాదాపు 15 రోజులు పాటు నిర్ణీత మోతాదులో మాత్రమే తాగాలి. లేదా మీకు అందుబాటులో ఉన్న ఆయుర్వేదవైద్యులను సంప్రదించి వాడుకోవాలి.
కిడ్నీ స్టోన్స్ ప్రారంభ దశలో కొండపిండి ఆకులరసం అద్భుతంగా పనిచేస్తుంది. 4 నుండి 7 మి.మి. ఉన్న రాళ్లవరకు ఈ ఆకుల రసం కరిగిస్తుంది. అంతకంటే పెద్ద రాళ్లు ఉన్నా, బాధ తట్టుకోలేకున్నా, వెంటనే తగ్గాలన్నా డాక్టర్ ను సంప్రదించాల్సి ఉంటుంది.
కొండ పిండి ఆకును కూరగా కూడా వండుకొని తింటారు కొంతమంది పప్పులో వేస్తారు