header

Lemon Grass….లెమన్‌ గ్రాస్‌ ఉసయోగాలు

Miracle Fruits… మిరకిల్‌ ఫ్రూట్‌ Lemon Grass….లెమన్‌ గ్రాస్‌ ఉసయోగాలు
నిమ్మగడ్డికి ఈ కాలంలో మంచి డిమాండ్‌ వుంది. ఎన్నో ఔషధ గుణాలున్న ఈ నిమ్మగడ్డిని కాస్త పెద్ద కుండీలో ఇళ్లలోనే పెంచుకోవచ్చు. నిమ్మగడ్డి టీ ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఈ ఆకుల్ని ఎండబెట్టి పౌడర్‌గా చేసుకుని తాగితే శరీరానికి ఉత్సాహం లభిస్తుంది. సువాసనలు వెదజల్లే నిమ్మగడ్డి ఇంట్లో క్రిమికీటకాలు రాకుండా కూడా చూస్తుంది.
లెమన్ గ్రాస్ లో విటమిన్ ఎ, విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్, మెగ్నీషియం, జింక్, కాపర్, ఐరన్, పొటాషియ, ఫాస్పరస్, క్యాల్షియం మరియు మెగ్నీషియంలున్నాయి. లెమన్ గ్రాస్ ముక్కు దిబ్బడ , జలుబు మరియు గొంతు నొప్పిని నివారిస్తుంది . శ్వాస బాగా తీసుకోవడానికి ఉపయోగపడుతుంది . మరియు లెమన్ గ్రాస్ లో ఉండే విటమిన్ సి వ్యాధినిరోధక శక్తి పెంచడానికి చక్కగా సహాయపడుతుంది
లెమన్‌ గ్రాస్‌ టీని నిత్యం తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. తిన్న ఆహారం చక్కగా జీర్ణమవుతుంది. గ్యాస్‌, అసిడిటీ, మలబద్దకం సమస్యలు పోతాయి.
లెమన్‌గ్రాస్‌ టీలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల ఈ టీని తాగితే హార్ట్‌ ఎటాక్‌, హార్ట్‌ స్ట్రోక్‌లు వచ్చేందుకు అవకాశాలు తక్కువగా ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు.
లెమన్‌గ్రాస్‌ టీని తాగితే క్యాన్సర్‌ వ్యాధి బారిన పడకుండా చూసుకోవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. లెమన్‌గ్రాస్‌ టీలో ఉండే ఔషధ కారకాలు క్యాన్సర్‌ కణాలను నాశనం చేస్తాయి. దీంతోపాటు శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. దీంతో క్యాన్సర్‌ రాకుండా ఉంటుంది.
శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో లెమన్‌ గ్రాస్‌ టీ అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే టైప్‌ 2 డయాబెటిస్‌ ఉన్నవారు ఈ టీని తాగితే శరీరంలో ఇన్సులిన్‌ లెవల్స్‌ పెరుగుతాయి. దీంతో షుగర్‌ లెవల్స్‌ తగ్గుతాయి.
నిద్రలేమి సమస్య ఉన్నవారు లెమన్‌ గ్రాస్‌ టీ తాగితే ఫలితం ఉంటుంది. అలాగే మానసిక ఒత్తిడి, ఆందోళన కూడా తగ్గుతాయి