ఈ మొక్క వలన చాలా ప్రయోజనాలున్నాయి. అందు చేతనే దీనిని విటమిన్ల మొక్క అని పిలుస్తారు. దక్షిణ ఆసియా దేశాలలోనూ, చైనాలోనూ ఈ మొక్కలు విరివిగా ఉన్నాయి. .
ఈ మొక్క ఒకటి రెండు ఆకులను ఉదయం వేళలో తీసుకోవడం ద్వారా రక్తశుద్ధి జరుగుతుంది. ఇందులో బి- కాంప్లెక్సు ఉండటం వలన నీరసం తగ్గి, హుషారుగా ఉంటారు. ఆరడుగుల ఎత్తు వరకు ఈ మొక్క గుబురుగా పెరుగుతుంది. ఈ మొక్కల ఆకులలో అన్నిరకాల విటమిన్లు ఉన్నాయి. ఈ మొక్క కరివేపాకు మొక్కను పోలి ఉంటుంది. ఈ మొక్క ఆకులను కూరలలో కరివేపాకులాగా వాడుకోవచ్చు.
ఈ మొక్కలు నర్సరీలలో అమ్ముతారు. వీటిని కుండీలలో సాధారణ మొక్కల లాగానే పెంచుకోవచ్చు. పైన చిగుర్లను తుంపుతుంటే గుబురులాగా పెరుగుతుంది. నెలకు ఒకసారి కంపోస్ట్ ఎరువు
వేస్తే సరిపోతుంది. ఎండ బాగా తగులుతుంటే మొక్క బాగా పెరుగుతుంది. మట్టిలో తేమ ఎక్కువగా ఉండకూడదు.పొడిగా ఉండాలి. మొక్క కింది భాగంలో ఉండే ఆకులను తుంచి వేస్తుంటే చీడపీడలు రావు. .
దగ్గు. ఊపిరితిత్తుల సమస్యలు మూత్ర సంబంధిత వ్యాధులు ఈ మొక్కల ఆకులను తినటం వలన తగ్గుతాయి. చిన్న పిల్లలకు ఈ ఆకలతో జ్యూస్ చేసి ఇస్తే వారికి కావలసిన విటమిన్స్ అందుతాయి