header

Miracle Fruits… మిరకిల్‌ ఫ్రూట్‌

Miracle Fruits… మిరకిల్‌ ఫ్రూట్‌ Miracle Fruits… మిరకిల్‌ ఫ్రూట్‌
కేరళకు చెందిన ఈ మొక్క రెండంగుళాల ఎర్రటి పండ్లను కాస్తుంది. ఈ పండును ఉదయం తింటే సాయంత్రం వరకు పులుపు, కారం, వగరు ఉన్న వంటకాలు ఏమి తిన్నా తీపిగానే ఉంటాయి. అతి తక్కువ ఎత్తు పెరిగే ఈ మొక్క వర్షాకాలంలో ఎక్కువ ఫలాలను ఇస్తుంది. దీని శాస్త్రీయనామం సిన్సెపాలమ్ డల్సీ పైకమ్. (Sincepalam dulce pykas plants)
ఈ మొక్కలను ఇంటి పెట్లో కూడా పెంచుకోవచ్చు. ఎరువులు పెద్దగా వేయనవసరం లేదు.చీడపీడలు అంతగా ఆశించవు.. అప్పుడప్పుడు వేపకషాయం చల్లితే మంచిది. ఈ పండ్లు మధుమేహంతో బాధపడే వారు, బరువు తగ్గాలనుకునే వారికి మంచిదంటారు. తీపి తిన్న అనుభూతిని కలిగిస్తాయి ఈపండ్లు. క్యాన్సర్ భాదితులకు కీమో ధెరపీ తరువాత నాలుకకు రుచి తెలియదు. అప్పుడు ఈ పండ్లు తినటంవలన ప్రయోజనం ఉంటుంది.
ఈమొక్కలు కాస్త ఖరీదైనవి. దొరకటం కూడా తక్కువే. ప్రత్యేకంగా చెప్పి తెప్పించుకోవలసి ఉంటుంది. అమెజాన్ నుండి, కొన్ని ప్రత్యేక నర్సరీలలో మాత్రమే ఈ మొక్కలు లభిస్తాయి