టైప్ -2 డయాబెటిస్ ను అత్యంత సమర్ధవంతంగా నియంత్రణలో ఉంచగలిగిన ఆకులు పొడపత్రి ఆకులు. వీటిని క్రమం తప్పకుండా వాడుతుంటే ఇన్సులిన్ మోతాదు తగ్గించుకుంటూ క్రమంగా ఇన్సులిన్ ను మానివేయవచ్చు.
వీటి ఆకులు కొంచెం పొడవుగా, మృదువుగా ఉంటాయి. పువ్వులు లేత పసుపు రంగులో గుండ్రంగాఉంటాయి.
పొడపత్రి తీగజాతికి చెందిన బహువార్షిక మొక్క అనగా సంవత్పరమంతా లభిస్తుంది. ఇది ప్రకృతి సిద్ధంగా తెలుగు రాష్ట్రాలలోని అరణ్యాలలోను, పంట పొలాలలోను పెరిగి పొదలపైకి పాకి పెరుగుతుంది. చిన్న పసుపుపచ్చని పుష్పాలు గుత్తులుగా పూస్తాయి. కాయలు 5 నుండి 7 సెం. మీ. పొడవు ఉండి ఒకే చోట రెండు జంటగా మేక కొమ్ముల మాదిరిగా కుదురుకొని వుంటాయి.
మామూలుగా దీని ఆకులు చాలా చేదుగా వుంటాయి. నమిలిన 3-4 గంటల వరకు కూడా చేదు అలాగే వుంటుంది. అయితే మధుమేహం గల వారికి మాత్రం చప్పగా అనిపిస్తాయి
ఉన్నతమైన ఔషధ గుణాలు కలిగిన పొడపత్రి మధుమేహులకు పరమ ఔషదం .ఆకులను నమలవచ్చు లేదా కషాయంగా చేసుకొని తాగవచ్చు .
ప్రతి రోజు పొడపత్రి కషాయం తీసుకుంటే మధుమేహులు రక్తంలో గ్లూకోస్ ను అదుపులో ఉంచుకోవచ్చు.
రక్త ప్రసరణ వ్యవస్థను గర్భాశయాన్ని స్థిర పరుస్తుంది. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని సమతులం చేసి, గుండె సంభదిత వ్యాధులను అరికట్టడంలో తోడ్పడుతుంది .
ఆస్తమా, చర్మ సంబందిత వ్యాధులకు కూడా దీనితో చికిత్స చేయవచ్చు .మల బద్ధకం, కాలేయ సంబంధిత సమస్యలను పరిష్కరించే శక్తి ఉంది