header

రణపాల ఆకులు …Bryophyllum pinnatum..

రణపాల ఆకులు …Bryophyllum pinnatum.. రణపాల ఆకులు …Bryophyllum pinnatum..
ఈ మొక్క సాంకేతిక నామం బ్రయోఫిల్లం ఈ మొక్కల జాతిలో సుమారు 40వరకు రకాలున్నా ఈ రణపాల మొక్కను మాత్రం మిరాకిల్ మొక్క అని చెప్పవచ్చు
ఈ మొక్కలను సులభంగా గుర్తుపట్టవచ్చు. రణపాల ఆకు కాస్త దళసరిగా ఉండి రుచిలో వగరు, కాస్త పులుపుగా ఉంటుంది. ఆకు చుట్టూ డిజైన్ లాగా (మందార ఆకులాగా) ఉంటుంది.
ఈ మొక్క ఆకు ద్వారానే తిరిగి ప్రత్యుత్పత్తి కొనసాగిస్తుంది.అనగా ఆకు నాటడం ద్వారా తిరిగి మొక్క మొలుస్తుంది.
ఈ రణపాల ఆకులను నేరుగా తినవచ్చు, సలాడ్లలో కలుపుకుని తినవచ్చు, లేక కషాయం తయారు చేసుకుని తాగవచ్చు. ఈ రణపాల ఆకు ఉదయం రెండు రాత్రి రెండు ఆకులు తినడం ద్వారా కిడ్నీలో, బ్లాడర్ లో ఎర్పడ్డరాళ్ళు బయటకు పోతాయి.
ఈ ఆకు తినడం వలన రక్తంలో క్రియాటిన్ తగ్గి డయాలసిస్ రోగులకు మూత్రపిండాల పనితీరు మెరుగుపడుతుంది.
మధుమేహం కూడ కాస్త అదుపులో ఉంటుంది ఆకు తినడం వలన కడుపులో అల్సర్లు తగ్గుతాయి. తద్వారా అజీర్తి, మలబద్దకం తగ్గతాయి. కీళ్లనొప్పులు కూడా తగ్గుతాయని అంటారు.
ఈ ఆకు తినడం వలన జలుబు, దగ్గు, విరేచనాలను నయం అవుతాయి. ఈ ఆకులో యాంటీపైరేటిక్ గుణం ఉండటం వలన మలేరియా టైఫాయిడ్ లను తగ్గిస్తుంది.
ఈ ఆకు డియూరిటిక్ లక్షణం కలిగి ఉండటం వలన మూత్రంలో రక్తం,చీము వంటివి పోకుండా నయం చేయబడుతుంది.
జుట్టురాలటం, తెల్లవెంట్రుకలు రావడం లాంటి సమస్యలు తగ్గుతాయి.
శరీరంపై ఏర్పడే కొవ్వుగడ్డలు, వేడికురుపులకు ఈ ఆకును పేస్ట్ లా చేసి గడ్డలు,కురుపులమీద కట్టుకట్టడం వలన అవి తగ్గుతాయి. శరీరంలో వాపులు కలిగినచోటు ఈ ఆకుల పేస్టును కట్టు కట్టడం ద్వారా వాపు తగ్గవచ్చు.
కామెర్ల వ్యాదిగ్రస్తులు ఉదయం,సాయంత్రం ఈ ఆకు రసం తీసుకోవడం వలన వ్యాధి నయం అవుతుంది.