సునాముఖిని నేలతంగేడు అనికూడా పిలుస్తారు. రెండు నుండి మూడు అడుగుల ఎత్తులో పొదలాగా పెరుగుతుంది. ఇండియన్ సెన్నా అని కూడా పిలుస్తారు. దీని శాస్త్రీయ నామం కాసియా అంగుష్టిఫోలియా
ఈ మొక్క కాయలు, ఆకులు కూడా ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. కాయలను, ఆకులను ఎండబెట్టి పొడి తయారుచేస్తారు
ఈ చూర్ణం ఒంట్లో వేడిని తగ్గించి, చలువచేస్తుంది. కంటి సంబంధిత రోగాలు తగ్గుతాయి. విరోచనాలు తగ్గుతాయి. ఈ ఆకుల రసాన్ని, కొబ్బరి నూనెలో కలిపి తయారు చేసిన నూనె తలకు వాడితే వెంట్రుకలు రాలకుండా ధృఢంగా తయారవుతాయి.