ప్రకృతి ప్రసాదితమైన ఆయుర్వేద మొక్కలలో అతి ప్రభావవంతమైనది తెల్ల గలిజేరు మొక్క. ఈ మొక్క ఆకులను పచ్చడిగా, పులుసు కూరగా లేక పప్పులో వేసుకొని వాడుకొనవచ్చు. దీనినే పునర్నవ అని కూడా అంటారు. శరీరంలోని ప్రతికణానికి ఉత్తేజం కలిగిస్తుంది కనుక దీనిని పునర్నవ అని అంటారు.
ఈ ఆకులు చర్మవ్యాధులను తగ్గిస్తాయి. రక్తాన్ని శుభ్రం చేస్తాయి.
ఈ ఆకుల రసం క్రమం తప్పకుండా కొన్ని రోజులపాటు తీసుకుంటే స్త్రీల ఋతు సంబంధమైన సమస్యలు తగ్గుతాయి.
ముఖ్యంగా మూత్రసంబంధమైన సమస్యలు తగ్గుతాయి. కిడ్నీ సమస్యలతో బాధపడేవారికి ఈ ఆకుల రసం ఓ వరమని ఆయుర్వేదంలో చెప్పబడింది. ఈ ఆకుల రసం ఉదయం,సాయంత్రం ఓ గ్లాసు మొతాదులో కొన్ని రోజులపాటు తీసుకుంటే కిడ్నీసమస్యలు తగ్గి, కాళ్లవాపులు తగ్గుతాయి. కిడ్నీలలో రాళ్లుకూడా తగ్గటానికి సహాయపడుతుంది. మూత్రపిండాల పనితీరు పెరుగుతుంది.
వ్యాధినిరోధక శక్తి పెరుగుతుందని పరిశోదనలలో కనుగొనబడింది. ఈ ఆకుల రసాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే మధుమేహం (డయాబెటిస్ లేక చక్కెరవ్యాధి) అదుపులో ఉంటుంది.
ఈ ఆకుల రసం ఒక రోజూ రెండుసార్లు ఒక స్పూన్ మోతాదులో తీసుకుంటే కడుపునొప్పి, కడుపు ఉబ్బరం తగ్గిపోతాయి.
ఈ ఆకుల రసాన్ని ముఖానికి పూసుకుంటే మచ్చలు తగ్గి ముఖ్యం కాంతివంతమవుతుంది. తెల్లగలిజేరు వేరు, పాలు, నీరు సమంగా కలిపి పాలు మిగిలేదాకా కాగబెట్టి వడపోసి తాగుతుంటే అన్ని రకాల జ్వరాలు తగ్గుతాయని చరకుని ‘శుశ్రుత సంహిత’ లో చెప్పబడింది.
గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు, గర్భిణీ స్త్రీలు ఈ ఆకులను తినకూడదు.