తిప్పతీగవల్ల అనేక ప్రయోజనాలుండటం వలన దీనిని అమృతవల్లి అని కూడా పిలుస్తారు.ఆయుర్వేదం ప్రపంచానికి అందించిన ఓ గొప్ప కానుక తిప్పతీగ. జ్వరం దగ్గరనుండి ఎయిడ్స్ వ్యాధి దాకా పోరాడుతుంది. ఇమ్యూనిటీని పెంచుతుంది. రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది.
తిప్పతీగ చూర్ణం రూపంలో, జ్యూస్ రూపంలో ఆయుర్వేద షాపులలో లభిస్తుంది. తిప్పతీగలో యాంటీ ఆక్సిడెంట్స్ఉంటాయి. ప్రీరాడికల్స్ తో పోరాడుతాయి. రక్తంలో చక్కెరస్థా యిలను తగ్గించి టైప్-2 మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుతుంది.
తిప్పతీగను చాలా సులభంగా గుర్తుపట్టవచ్చు. ఈ తీగలు 365 రోజులు లభిస్తాయి. వీటి ఆకులు కాండనికి కణుపుకు ఒకటిచొప్పున హృదయాకారంలోలో ఉంటాయి. ఆకులమీద నూగు లేకుండా తమలపాకులు లాగా నునుపుగా ఉంటాయి. తిప్పతీగకు ఎర్రటి చిన్న పండ్లు కాస్తాయి.
- తిప్పతీగ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
- రక్తాన్ని శుభ్రపరచి చెడ్డ బ్యాక్టీరియాను నిరోధిస్తుంది.
- జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.
- కొన్నిరకాల విషజ్వరాలను నిరోధిస్తుంది.
- టైప్ -2 మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుతుంది.
- వత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది.
- శ్వాస సంభంధ సమస్యలుతగ్గుతాయి.
- కీళ్ల వ్యాధులను తగ్గిస్తుంది.
- కంటిచూపును మెరుగుపరుస్తుంది.