header

ఉత్తరేణి ఆకులు...Uttareni Leaves...

ఉత్తరేణి ఆకులు...Uttareni Leaves... ఉత్తరేణి ఆకులు...Uttareni Leaves...
ఉత్తరేణి ఒక ఔషధ మొక్క. దీని శాస్త్రీయనామం Achyranthes Aspera. దీనిని వినాయక చవితి పూజలో ఉపయోగిస్తారు. ఆయుర్వేదంలో ఈ మొక్కకు చాలా ప్రాధాన్యం ఉంది.
ఈ ఆకుల రసం కడుపు నొప్పికి, అజీర్తికి, మొలలకు, వేడి గడ్డలకు మందుగా వాడతారు. పల్లెలలో ఈ చెట్టు వేర్లతో పళ్లు తోముకుంటారు. దీనివలన పంటి చిగుళ్లు, పళ్లు గట్టిపడతాయి.
ఈ మొక్కలు ఎరుపు, తెలుపు రంగులతో ఉన్న పొడవాటి కంకులను కలిగి ఉంటుంది. కిందపడి దెబ్బలు తగిలి రక్తం కారుతుంటే ఈ ఆకుల రసాన్ని పూస్తే రక్తం ఆగిపోతుంది. శరీరంపై పొక్కులు, దురదలు ఉంటే ఈ ఆకుల రసాన్ని పైపూతగా పూస్తే తగ్గుతాయి
కందిరీగలు, తేళ్లు, తేనెటీగలు కుట్టినపుడు ఈ ఆకులను ముద్దగా నూరి పెడితే నొప్పులు, దురదలు తగ్గుతాయి. ఈ మొక్కలను వేళ్లతో సహా కాల్చి బూడిద చేసి, ఆ బూడిదలో ఆముదం కలిపి రాస్తే గజ్జి, తామర లాంటి చర్మవ్యాధులు తగ్గుతాయి. ఈ ఆకుల రసం కడుపులోని నులిపురుగులను చంపుతుంది.