వావిలిని సంస్కృతంలో సింధువార అని అంటారు. దీని శాస్త్రీయ నామం Vitex Nirgundo. వావిలి ఆకులును వినాయక చవితి పూజాపత్రిలో వాడతారు, ఇవి తెలుపు, నలుపు రంగులలో ఉంటాయి.
వావిలి ఆకులను శరీరం మీద వాపులను తగ్గించటానికి వాడతారు. ఈ ఆకుల రసాన్ని నువ్వుల నూనెలో కలిపి కాచి కొద్దిగా వెచ్చగా ఉన్నపుడు వాపుల మీద, నొప్పులు ఉన్నచోట పైపూతగా వాడితే నొప్పులు తగ్గుతాయంటారు.
కడుపులో పుండ్లకు, చెవి వ్యాధులకు, మలేరియా జ్వరానికి, కఫం తగ్గటానికి వావిలి ఆకులను ఆయిర్వేదంలో వాడతారు.
బాలింతలకు చేయించే స్నానపు నీళ్లలో వావిలాకులను కలిపి మరిగిస్తారు. దీని వలన ఒళ్లు నొప్పులు, వాతపు నొప్పులు తగ్గుతాయంటారు.ఈ ఆకుల రసంలో అల్లం రసం కలిపి ముక్కులో రెండు బొట్లు వేస్తే పార్శ్వపు నొప్పి తగ్గుతుంది.