Best Aroma Oils…ఆరోమా నూనెలు...

Best Aroma Oils…ఆరోమా నూనెలు...

చెట్ల ఆకులు, పూలు, బెరళ్లు, వేర్లు నుండి సహజసిద్ధంగా తయారయ్యేవే ఆరోమా నూనెలు. వీటితో చేసేది ఆరోమా థెరపి. ఈ నూనెలన్నీ సహజసిద్దమైన ప్రకృతి వరాలు. ఈ నూనెలు శారీరక, మానసిక పరిస్థితులను సరిదిద్దటానికి చక్కగా పనిచేస్తాయి.
Jasmin Oil…జాస్మిన్ ఆయిల్
మధురిమలు ఒలికించే సువాసనలతో కూడిన జాస్మిన్ ఆయిల్ ను ఆరోమా నూనెలలో రారాజుగా చెబుతారు. యాంగ్జయిటీ, డిప్రెషన్ ను తగ్గిస్తుంది. నరాలకు ప్రయోజనకరమైనది. చర్మం యొక్క ఎలాస్టిటీని పెంచుతుంది.
వాడేవిధానం మసాజ్ కోసం కొబ్బరి నూనో, ఆలివ్ నూనె, ఆముదం వంటి ప్రదాన నూనెలలో రెండు, మూడు చుక్కలు జాస్మిన్ ఆయిల్ కలుపుకోవాలి. స్నానం చేసే నీటిలో కూడా ఈ నూనె చుక్కలు కలుపుకోవాలి.
Tee Tree Oil…టీ ట్రీ ఆయిల్
ఈ ఆయిల్ శక్తివంతమైన యాంటీసెప్టిక్ ఆయల్. దీని ఆవిరి క్రిములను నశింపచేస్తుంది. శీతాకాలానికి తగినది. చర్మానికి క్లెన్సింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. పాదాల దుర్వాసనను, చుండ్రును తగ్గిస్తుంది.
వాడేవిధానం మసాజ్ కోసం వాడే నూనెలో రెండు, మూడు చుక్కల టీ ట్రీ ఆయిల్ ను కలుపుకోవాలి. స్నానం చేసే నీటిలో కూడా కలుపుకోవచ్చు. తెగిన గాయాలు, దెబ్బలు, మొటిమలపై ఒక చుక్క రాయవచ్చు.
Rosewood Oil..రోజ్ వుడ్ ఆయిల్
రోజ్ వుడ్ ఆయిల్ తీపి వాసన వెదజల్లుతుంది. యాంటీసెప్టిక్ గుణాలు కలిగి వుంటుంది ఈ ఆయిల్. పునరుత్తేజాన్నిచ్చే రిలాక్సెంట్ ఆయిల్. యాంగ్జయిటీని తగ్గిస్తుంది. పొడిచర్మం గలవారికి చక్కగా పనిచేస్తుంది.
వాడేవిధానం క్యారియర్ ఆయిల్ లో రెండుమూడు చుక్కల రోజ్ వుడ్ ఆయిల్ కలిపి మసాజ్ చేసుకోవాలి. ఆవిరి పెట్టుకోవటానికి, స్నానం చేసే నీటిలో కూడా కలుపుకోవచ్చు.
Lavender Oil… లెవెండర్ ఆయిల్
అన్ని రకాల చర్మ, శిరోజాల సమస్యల నివారణలో వాడుకోవచ్చు. ఆలిపిషియా, డెర్మటైటిస్, ఎగ్జిమా, ఇన్ ఫ్లమేషన్, సొరియాసిస్ లకు బాగా పనిచేస్తుంది. జలుబు, నొప్పులు, రుమాటిక్ లకు పనిచేస్తుంది. కాలిన గాయాలపై రాస్తే ఉపశమనంగా ఉంటుంది. యాంటీ డిప్రెసెంట్ గా పనిచేస్తుంది.
వాడేవిధానం రెండు మూడు చుక్కల లెవెండర్ ఆయిల్ ను క్యారియర్ ఆయిల్ లో కలిపి మసాజ్ చేసుకోవచ్చు. తెగిన గాయాలపై ఒక చుక్క రాయాలి. క్రిమి కీటకాలు కుట్టిన చెట కూడా రాయవచ్చు. ఈ నూనెతో ఆవిరి పెట్టుకోవచ్చు. స్నానం చేసే నీటిలో రెండు చుక్కలు కలుపుకోవచ్చు. లో బి.పి ఉన్నవారు వాడకూదు.
Yang…Yang Oil…యాంగ్....యాంగ్ ఆయిల్
తియ్యని వాసన ఈ ఆయిల్ నుండి వస్తుంది. శక్తివంతమైన శృంగారపూరిత స్టిములెంట్. చర్మానికి పునరుత్తేజాన్ని ఇస్తుంది. గుండెదడ, హై బి.పిలకు నెర్వస్ టెన్షన్ కు మంచి ఔషధం. వాడే విధానం క్యారియర్ లేదా హెయిర్ ఆయిల్ లో రెండు, మూడు చుక్కలు కలుపుకుని వాడుకోవచ్చు. తలస్నానం చేసిన తరువాత జుట్టును శుభ్రంగా ఆరబెట్టుకుని ఒక టీస్పూన్ నీటిలో రెండు చుక్కలు కలిపి జట్టుకు రుద్దుకోవచ్చు.
ఆవిరి పెట్టుకోవటానికి, స్నానం చేసే నీటిలో కలుపుకోవటానికి వాడుకోవచ్చు. ఎక్కువగా వాడ కూడదు. తలనొప్పి వచ్చే అవకాశం ఉంది.



తెలుగువారి కోసం తెలుగు వెబ్ సైట్...తెలుగు కిరణం.. Telugu Website for Telugu People..
Websites in English and Telugu Languages will be designed… Telugu Unicode Fonts..will be typed for Telugu websites…
at reasonable rates... for further details click contact us