సాధారణంగా ఎక్కువమంది వాడేది టేబుల్ సాల్ట్. ఆహార పదార్థాల్లో సులువుగా కలిసిపోతుంది. దీనినే ఐడైజ్డ్ సాల్ట్ అని కూడా అంటారు. ఈ ఉప్పు నుంచి అయోడిన్ అందుతుంది. అయోడిన్ లోపం వలన ధైరాయిడ్ వస్తుంది. కానీ సహజసిద్ధంగా కొన్ని ఆహర పదార్ధాల నుండి అయోడిన్ లభిస్తుంది. ఈ రకం ఉప్పును అయోడిన్ లోపం ఉన్నవారు మాత్రం వాడితే సరిపోతుందంటున్నారు ఆహారనిపుణులు. అయోడిన్ లోపం లేనివారు మామూలు ఉప్పు వాడుకోవచ్చు
దీన్ని కల్లుప్పు లేదా రాళ్లుప్పు అంటారు. ఇందులో అయోడిన్ ని అదనంగా జతచేయరు. దీన్ని పదార్థాల్లో కలిపినప్పుడు ఉప్పు రుచే వస్తుంది. ఈ ఉప్పును నిత్యం తీసుకోవడం వల్ల సోడియం శాతం చాలా తక్కువగా అందుతుంది. అధిక రక్తపోటు సమస్య అదుపులో ఉంటుంది
చేపల్ని శుభ్రం చేయడానికి ఈ ఉప్పు సరైన ఎంపిక. వాసన వదులుతుంది. పొలుసు సులువుగా పోతుంది
సముద్రపు నీటిని ఆవిరిపట్టి దీన్ని తయారుచేస్తారు. ఇది పదార్థాల్లో అంత త్వరగా కరగదు. ఇందులో ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా మెగ్నీషియం, క్యాల్షియం, పొటాషియం, ఇనుము, జింక్, అయోడిన్ శాతం ఎక్కువ. దీన్ని ఒక చెంచాకు మించి తీసుకోకూడదు.
అధికరక్తపోటుతో బాధపడేవారికి ఇది సరైన పరిష్కారం. సాధారణ ఉప్పుతో పోలిస్తే... ఇందులో సోడియం ముప్పైశాతం తక్కువగా ఉంటుంది. ఇది మంచిదే కానీ... పదార్థానికి రుచి రావడానికి దీన్ని ఎక్కువగా వాడాల్సి వస్తుంది
ఈ ఉప్పును హిమాలయన్ సాల్ట్ అనీ అంటారు. ఇందులో ఖనిజాల మోతాదు ఎక్కువ. ఇది కండరాల నొప్పుల్ని నివారిస్తుంది. శరీరమంతటికీ రక్తప్రసరణ సజావుగా సాగేలా చేస్తుంది. కేవలం ఆహారంలోనే కాదు, స్నానానికీ దీన్ని వాడతారు.
రాతి ఉప్పు భూగర్భంలోని రాతి ఉప్పు గనులనుండి తయారవుతుంది. గనుల నుండి సేకరించి వాడుకుంటాని వీలుగా తయారు చేస్తారు.
ఈ ఉప్పులో ప్రకృతి సహజంగా ఉండే మినరల్స్ ఉంటాయి. బేకరీ పదార్ధాలకు అదనపు టెక్సర్ కోసం వాడతారు.
మాంసంలోని టాక్సిన్స్ తొలగించటానికి కూడా ఈ ఉప్పును ఉపయోగిస్తారు.