సహజంగా మానవుల మాడు యొక్క పొటెన్షియల్ హైడ్రోజన్ (PH) శాతం 5.5. శాతం ఉంటుంది. కాబట్టి ఇదే శాతం ఉన్న షాంపూలను వాడితే ప్రయోజనం ఉంటుంది. ఈ షాంపూలను వాడటం వలన చుండ్రు సమస్య కూడా తగ్గుతుంది.
షాంపూలన్నీ యాసిడ్, బేస్డ్, నూట్రల్ వంటి రకాలలో లభిస్తాయి. బేసిక్ షాంపూలు గాఢత ఎక్కువగా ఉన్న షాంపూలు. వీటిని ఎంత తక్కువగా వాడితే అంత మంచిది.
మిగతా రెండు రకాలు కురులకు మేలు చేస్తాయి. ప్రస్తుతం మార్కెట్లో ఔషధ గుణాలున్న షాంపూలలో పి.హెచ్ శాతం ఉంటుంది. షాంపూలు కొనేముందు వాటిపై ముద్రించబడిన పీ హెచ్ శాతాన్ని తెలుసుకోవచ్చు.
పిల్లల కోసం వాడే బేబీ షాంపూలలో కూడా పి.హెచ్ శాతం 5.5. ఉంటుంది కనుక ఈ షాంపూలను పెద్దవారు కూడా వాడుకోవచ్చు.
జుట్టు రాలే సమస్య ఉన్నవారు విటమిన్ ఆధారిత షాంపూలను వాడుకోవాలి. కురులు ఆరోగ్యంగా ఉండాలంటే కండీషనర్లు ఉన్న షాంపూలను వాడాలి లేకపోతే జుట్టు చివర్లు చిట్లిపోతాయి.
కండీషనర్ ఉన్న షాంపూలతో మొదటిసారి తల రుద్దినపుడు తలలో ఉన్న మురికి పూర్తిగా తొలగిపోతుంది. రెండోసారి షాంపూవాడినపుడు తలలో ఉన్న నూనె పొర తొలగిపోతుంది. ఈ కండీషనర్ మళ్లీ తలలో సహజనూనెలు విడుదలయ్యేవరకు రక్షణగా నిలుస్తుంది.
వారంలో కనీసం రెండుసార్లైనా తలస్నానం చేయాలి. అప్పుడే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది....