సబ్బులు సోడియం మరియు పొటాషియం సాల్ట్స్ కలిగి ఉంటాయి. సాధారణంగా సబ్బులలో ఉంటే టి.ఎఫ్.యం (TFM - Total Fatty Matter) శాతాన్ని బట్టి సబ్బుల నాణ్యతను నిర్ణయుస్తారు. ప్రతి సబ్బుకు పైన ఉండే రేపర్ (ప్యాకింగ్ అట్ట) పైన TFM శాతాన్ని ముద్రిస్తారు.
80 శాతం కానీ అంతకంటే ఎక్కువకానీ టి.ఎఫ్.యం. శాతం ఉంటే వాటిని మొదటిరకం (నాణ్యత) సబ్బులుగా పరిగణిస్తారు.
65 శాతం నుండి 80 శాతం లోపు టి.ఎఫ్.యం. ఉండే సబ్బులను రెండవ శ్రేణికి చెందిన సబ్బులుగా పరిగణిస్తారు.
మూడవ రకం సబ్బులు... టి.ఎఫ్.యం. 65 శాతానికి తక్కువగా ఉండే సబ్బులను మూడవ రకం సబ్బులుగా పరిగణిస్తారు.