

బ్యాంకుల వలన ఖాతాదారులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలు పరిష్కరించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్  ఇండియా అంబుడ్స్‌మెన్ వ్యవస్థను 1995లో ఏర్పాటు చేసింది. కాని అంబుడ్స్‌మెన్‌ను సంప్రదించేముందు మీరు విధిగా సమస్యను బ్యాంకు ఉన్నతాధికారి దృష్టికి తీసుకు వెళ్ళాలి. అక్కడ సమస్యకు పరిష్కారం లభించకపోతే అప్పుడు అంబుడ్స్‌మెన్‌ను సంప్రదించాలి. 
ఏ ఏ సమస్యలలో అంబుడ్స్‌మెన్‌ను సంప్రదించవచ్చు:
బ్యాంకు అందించే అన్ని రకాల సేవల్లో అంటే చెల్లింపులలో జాప్యం, చిన్న నోట్లను అనుమతించకపోవటం, చెక్ బుక్కులు ఇవ్వకపోవటం, బ్యాంకర్ల చెక్కులు, డి.డిలు చెల్లక పోవటం, ఏ టి.ఎం, క్రెడిట్ కార్డుల్లో తలెత్తిన సమస్యలు ఇలా వేటిపై నైనా సంప్రదించవచ్చు. 
ఫిర్యాదు చేసే విధానం : 
నేరుగా అంబుడ్స్‌మెన్ కార్యాలయాన్ని సంప్రదించడం ద్వారా కాని లేదా పోస్ట్, ఆన్‌లైన్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు. 
అంబుడ్స్‌మెన్ కార్యాలయం హైదరాబాద్‌లో ఉంది. ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదు చేయాలనుకున్నవారు  
www.rbi.org.in/scripts/bs_content.aspx?id=164# అనే లింక్ పైన క్లిక్ చేయండి. లేదా దిగువ పేర్కొన్న చిరునామా, టెలిఫోన్ నెంబర్లద్వారా సంప్రదించవచ్చు. 
Reserve Bank of India
 6-1-56, Secretariate Road
 Saifabad, Hyderabad - 500 004
 Tel. Nos:  040-23210013 / 040-23243970. 
 Fax: 040-23210014