header

How to get Passport ,,,? పాస్‌పోర్టు పొందటం ఎలా ?

How to get Passport ,,,? పాస్‌పోర్టు పొందటం ఎలా ?

1. www.passportindia.gov.in కు లాగిన్‌ కావాలి
2. యూజర్‌ ఐ.డి. మరియు పాస్‌వర్డ్‌ పెట్టుకోవాలి
3. ఆన్‌లైన్‌లో ధరఖాస్తు పూర్తి చేసి ఆప్‌లోడ్‌ చేయాలి. (సంబంధిత పత్రాలను స్కాన్‌ చేసి అప్‌లోడ్‌ చేయాలి)
4. ధరఖాస్తు రిఫరెన్సు నెంబరును (ఏ.ఆర్‌.ఎన్‌) ను భద్రపరచుకోవాలి. అపాయంట్ మెంట్ పత్రాన్ని డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.
5. ఖాళీని బట్టి అపాయంట్ మెంట్ కోరాలి. నిర్థేసిత సమయంలో సేవా కేంద్రానికి వెళ్ళి సంబంధిత అధికారిని కలవాలి. ఒరిజనల్‌ పత్రాలు తప్పనిసరిగా తీసుకు వెళ్ళాలి. ఫోటోలు సేవాకేంద్రం వారే తీస్తారు.
6. ధరఖాస్తు పరిశీలన ఏ దశలో ఉందో తెలుసుకోవానికి 1800-258-1800 నెంబరుకు ఫోన్‌ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. లేదా వెబ్‌ సైట్లో చూడవచ్చు.
7. పాస్‌పోర్టు కేంద్రాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మాత్రమే పనిచేస్తాయి.
విజయవాడలోని పాస్‌పోర్ట్‌ కేంద్ర పరిధిలోని జిల్లాలు: కృష్ణా, గుంటూరు, ఖమ్మం, ప్రకాశం
తిరుపతిలోని పాస్‌పోర్ట్‌ కేంద్ర పరిధిలోని జిల్లాలు: చిత్తూరు, అనంతపురం, నెల్లూరు
నిజామాబాద్‌లోని పాస్‌పోర్ట్‌ కేంద్ర పరిధిలోని జిల్లాలు: నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌
హైదరాబాద్‌ లోని పాస్‌పోర్ట్‌ కేంద్రాల (3) పరిధిలోని జిల్లాలు: హైదరాబాద్‌, మెదక్‌ రంగారెడ్డి, వరంగల్‌, కర్నూలు, నల్గొండ,మహబూబ్‌ నగర్‌.