header

Rights After Death

మరణానంతర హక్కులు
మరణించిన తరువాత పార్ధీవ శరీరాలకు జరగాల్సిన క్రియలన్నీ సక్రమంగా జరపాలి. అలా కాకుండా అడ్డుకుంటే హక్కులను కాలరాసినట్లే అవుతుంది. అలా ఎవరు చేసినా హక్కుల ఉల్లంఘన జరిగిందని రాష్ట్రమానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేయవచ్చు.

ఇంట్లో ఎవరైనా అద్దెకు ఉన్నందుకు ఇంటి యజమాని ప్రతిఫలంగా ప్రతినెలా కొంత నగదును వసూలు చేస్తాడు. అదే ఇంట్లో మొన్నటి వరకు తమతో కలసిమెలసి ఉన్న వ్యక్తి చనిపోతే ఇంటి గడపలోపలకే రానివ్వరు. అలా రానివ్వకుండా అడ్డుకునే హక్కు ఇంటి యజమానికి చట్టం కల్పించదు. జీవించడానికి ఎలాంటి స్వేచ్ఛ ఉందో మరణానంతరం పార్ధివ శరీరాలకు ధర్మనిష్టల ప్రకారం స్వేచ్ఛగా ఖననం చేసుకునే అవకాశాన్ని చట్టం కల్పించింది.

ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ లీజ్ రెంట్ ఎవిక్షన్ కంట్రోల్ యాక్టు 1960 ప్రకారం అద్దెదారులకు కొన్ని హక్కులను చట్టపరంగా కల్పించారు. ఇందులో జీవించే, మరణానంతరం కర్మలకు సంబంధించిన హక్కులున్నాయి.

ఇంటి యజమానితో సమానమైన హక్కులను ఆ భవనంపై అద్దెదారులు కలిగి ఉంటారు. తాము నివసించే భవనంలో యజమానికి ఎలాంటి వసతులుంటాయో, స్వేచ్ఛ ఉంటుందో అదే అద్దెదారుకు కూడా వర్తిస్తుంది.

అద్దెదారు కుటుంబంలో ఎవరైనా మరణిస్తే ఇంట్లోకి రానివ్వకుండా మృతదేహాన్ని అడ్డుకునే అధికారం యజమానికి ఉండదని న్యాయనిపుణులు చెబుతున్నారు.

సొంత ఇల్లు, అయినవారు లేని సమయంలో అద్దె భవన కుటుంబం, చుట్టుపక్కల నివసించేవారి సహకారంతో ధర్మనిష్టల ప్రకారం ఖననం చేసుకోవచ్చని చట్టం చెబుతోంది. వీటిని ఉల్లంఘిస్తే అది చట్టవిరుద్ధమవుతుంది.

గరుడ పురాణంలో మరణానంతర క్రియలగురించి ఇలావుంది

ఆత్మ దేహాన్ని వదిలి పరమాత్మలో ఐక్యం అయ్యే మయంలో పార్థివ శరీరాన్ని వదలి పెడుతుంది. ఆత్మ ఎలా శూన్యం ద్వారా పరమాత్మను చేరుకుంటుందో మరణానంతరం ఉన్న పార్ధివ శరీరం కూడా అత్యంత పవిత్రమైన ధర్మానిష్టక్రియలతో (ఖననం) పంచభూతాలకు అర్పించాలి. ఇది అత్యంత పవిత్రమైన కార్యం.

ఎవరైతే పార్థివ దేహాన్ని తన ప్రాంతంలో తాకుతూ స్మరిస్తూ అతని మంచి గురించి వివరిస్తూ ఖననం చేస్తారో వారు పుణ్యకార్యం చేసిన వారవుతారు.

తనువు చాలించిన దేహాన్ని అశ్రద్ధకు గురిచేసినా అపరిశుభ్రం చేసినా అశుద్ధ క్రియలు చేసినా ఆ దేహం గురించి అసత్యం మాట్లాడుకున్నా అరోరా నరకాలకు చేరవేయబడతారు.

పార్థివ దేహాలను పవిత్రంగా చూసిన వారికి అత్యంత నరకప్రాయమైన విస్తరేణి నది కూడా గంగాజలంగా మారుతుంది.