వస్తువులు, సేవలను విక్రయించడానికి అనుచితమైన, మోసపూరితమైన విధానాలను అవలంభిస్తే అటువంటి విధానాలను అనుచిత వ్యాపార విధానాలుగా చట్టంలో పేర్కొనడం జరిగింది. వినియోగదారుల కోర్టులో ఫిర్యాదు చేయాలంటే వ్యాపారి అనుచిత వ్యాపారవిధానాలు అనుసరిస్తున్నాదనిగాని, నిర్భంద వ్యాపారవిధానాలను అనుసరిస్తున్నాడనిగాని, పేకెట్ పై సూచించిన ధరకంటే ఎక్కువ వసూలుచేసాడనికాని నిరూపించాలి. అపుడే వినియోగదారుల కోర్టు ఆ ఫిర్యాదును స్వీకరిస్తుంది. ఈ క్రింద చెప్పబడిన విషయాలు అనుచిత వ్యాపారవిదానాలుగా చట్టంలో పేర్కొనబడింది.
• వస్తువుల నాణ్యత, ప్రమాణం, పరిమాణం వంటి విషయాలను తప్పుగా చెప్పడం
• సేవలలోలేని పరిమాణము . ప్రమాణము వున్నట్లుగా చెప్పడం
• పాతవస్తువును లేదా బాగుచేసిన వస్తువును కొత్త వస్తువనిచెప్పడం
• లేని నాణ్యతా ప్రమాణాలు లేదా ప్రయోజనాలను ఉన్నట్లుగా చెప్పడం
• సరైన పరీక్షలు జరుపకుండా వస్తువుల చిరకాలం మన్నుతాయని గ్యారంటీ ఇవ్వడం
• గ్యారంటీలు, వారెంటీలు తప్పుదారి పట్టించేవిగా వుండటం
• బూటకపు డిస్కౌంట్లు ఇవ్వడం
• ఉచితంగా ఇస్తామన్న బహుమతులకు కూడా ఛార్జీలు వసూలుచేయడం
• వ్యాపారం పెంచుకోవడంకోసం పోటీలు లాటరీలు నిర్వహించడం
• గిఫ్ట్ స్కీం లో విజేతల పేర్లను ప్రకటించకపోవడం
• తెలిసి నాణ్యవిహీనమైన వస్తువులను విక్రయించడం
• వస్తువులను దాచి లేదా అమ్మడానికి నిరాకరించి ధరలను పెంచడానికి ప్రయత్నించడం
• నకిలీ వస్తువులను తయారుచేయడం