header

MarriageRegistration Act

వివాహ రిజిస్ట్రేషన్ చట్టం

2006 ఫిబ్రవరి 14వ తేదీన భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం వివాహాల నమోదు తప్పనిసరి చేయాలని ఆదేశిస్తూ మార్గదర్శకాలను జారీ చేసింది. హిందూ వివాహచట్టప్రకారం వరుడికి 21 సంవత్సరాలు, వధువుకు 18 సంవత్సరాలు నిండిన తరువాతనే వావాహం చేయాలి.
వివాహం నమోదు చేసుకునే విధానం
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వివాహనమోదు ఎప్పటినుంచో ఉంది. పురపాలక సంఘాల్లోనూ, వివాహనమోదుకు ప్రత్యేక సిబ్బంది ఉంటారు. గ్రామపంచాయితీలలో కూడా నమోదు చేసుకోవచ్చు. ముందుగానే వివాహసమాచారాన్ని పంచాయితీ కార్యదర్శికి అందజేస్తే నిర్ణీతరుసుం తీసుకుని ధరఖాస్తు ఫారం ఇస్తారు. ముగ్గురు సాక్షుల సంతకాలతో పంచాయితీ కార్యదర్శి పురపాలక ప్రత్యేక ఉద్యోగి వివాహ ధృవీకరణపత్రం మంజూరు చేస్తారు. చాలాకాలం క్రితం పెళ్లయిన వారు కూడా నమోదు చేసుకునే అవకాశం ఉంది.
రిజిస్ట్రేషన్ కు కావల్సిన పత్రాలు
చదువుకున్న వారైతే 10వ తరగతి మార్కుల జాబితా, నివాస ధృవీకరణపత్రం, రేషన్ కార్డు, ఓటరు కార్డు, ఆధార్ కార్డులలో ఏదో ఒకటి ఉండాలి. తాళికట్టిన, జీలకర్ర బెల్లం పెట్టిన ఫోటోలు జతచేయాలి. గుళ్లో పెళ్లి చేసుకుంటే ఆలయ అధికారులు కానీ, బాధ్యులు కానీ ధృవీకరణపత్రం ఇవ్వాలి. వేర్వేరు కులాలు, మతాల వారు వివాహం చేసుకుంటే ముందుగానే సబ్ రిజిస్ట్రారు కు సమాచారం ఇవ్వవలసి ఉంటుంది. దీంతోపాటు ఫోటోలు, ముగ్గురు సాక్షుల సంతకాలు ఉండాలి.
ప్రయోజనాలు
వివాహం నమోదుచేసుకున్న మహిళలకు ఏమైనా సమస్యలు వస్తే సులభంగా పరిష్కరించుకోవచ్చు. విడాకులు, భరణం, పిల్లల సంరక్షణ, ఆస్తుల వివాదాల్లోనూ, వివాహ ధృవీకరణ పత్రాలను పరిగణనలోనికి తీసుకుంటారు.
రెండో వివాహాన్ని అడ్డుకునేందుకు రిజిస్ట్రేషన్ ఉపయోగపడుతుంది.
ప్రేమపేరుతో జరిగే మోసాలకు అడ్డుకట్టవేయవచ్చు.
వరకట్నవేధింపులు, శారీరక, మానసిక వేధింపులకు గురిచేసే భర్తలు, వారి కుటుంబ సభ్యులపైనా ఫిర్యాదులకు ఉపయోగపడుతుంది.
పాస్ పోర్ట్ పొందేందుకు ఉపయోగపడుతుంది.
వివాహధృవీకరణపత్రం మనదేశంతోపాటు ప్రపంచంలో ఎక్కడైనా ఉపయోగపడుతుంది.