header

Packed Items

ప్యాకేజబుల్ కమ్మోడిటీస్ ఆర్డర్

కొన్నికొన్ని వస్తువులు పదార్ధాలు విడిగా అమ్మడానికి వీలువుండదు. తప్పనిసరిగా వాటిని ప్యాకెట్లో పెట్టి అమ్మాల్సిందే. ఉదాహరణకు ద్రవరూపంలో వున్న పదార్ధాలు ప్యాక్ చేసి మాత్రమే విక్రయించడానికి కుదురుతుంది.. అలాగే అగ్గిపుల్లలు లూజుగా ఇవ్వలేరుకదా. పెట్టెలో పెట్టి అమ్మాలి.. కూల్ డ్రింకులు, బిస్కట్లు ఒకటేమిటి చాలా రకాల వస్తువులు ప్యాక్ లో ఉంచి అమ్ముతారు. మరి ప్యాక్ లో ఉంచిన పదార్ధం ఏమిటో దాని స్వరూప స్వభావాలు ఎలావున్నాయో వినియోగదారులకు తెలియాలికదా. వినియోగదారుడు మోస పోకుండా .ప్రభుత్వం ప్యాకేజబుల్ కమ్మోడిటీస్ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఉత్తర్వులు ప్రకారం ఉత్పత్తిదారుడు లేదా ప్యాక్ చేసినవారు తప్పనిసరిగా ప్యాక్ పై ఈ క్రింది సమచారాన్ని ముద్రించవలసి ఉంటుంది. అలా చేయకపోతే వారు శిక్షార్హులు.

1. ప్యాక్ లో వుంచబడిన వస్తువు యొక్క వర్ణన.

2. ప్యాక్ చేసిన తేది

3. ప్యాక్ చేసిననాడు ఆ పదార్ధముయొక్క నికర బరువు

4. ఉత్పత్తిదారుని లేదా ప్యాక్ చేసిన వారి పూర్తి చిరునామా

5. ఆ వస్తువుయొక్క గరిష్ట చిల్లర ధర

ఆహారపదార్ధాలకు తప్పనిసరిగా ఏ తేదీలోపు ఆ పదార్ధాన్ని భుజించాలో తెలియజేయాలి(బెస్ట్ బిఫోర్ డేట్).

మందులకైతే తయారి తేదీతో పాటు ఎక్స్ పైరి తేది కూడా ఇవ్వాలి. ప్యాక్ పై ముద్రించిన సమాచారానికి అనుగుణంగా ఆ వస్తువు లేకపోయినా లేదా ప్యాక్ పై ముద్రించిన ధరకంటే ఎక్కువ ధరకు అమ్మినా చిల్లర వ్యాపారులుపై జరిమానా విధిస్తారు. లీగల్ మెట్రాలజి శాఖకు ఈ విషయాలపై అధికారం కల్పించారు. లీగల్ మెట్రాలజి అంటే తూనికలు కొలతల శాఖ. ముఖ్యంగా చిల్లర వ్యాపారులే శిక్షలకు గురికావడం జరుగుతుంది.

ఉత్పత్తిదారుడు/ప్యాక్ చేసినవారు స్థానికంగా వుండరు కనుక చిల్లర వ్యాపారులను కూడా ఈ కేసులో ఇరికించడం జరుగుతుంది. ఈ సమాచారాన్ని సరిగా ముద్రిచండంలో ఉత్పత్తిదారుని/ప్యాక్ చేసినవారి వైఫల్యమే అని కోర్టు నిర్ధారణకు వచ్చిన తరువాత మాత్రమె చిల్లర వ్యాపారిని కేసునుండి తప్పిస్తారు. అందుచేత ఈ విషయంలో చిల్లర వ్యాపారులు అప్రమత్తంగా వుండాలి.