header

Rulles and |Regulations

ఫిర్యాదు చేసేవారు తెలుసుకోవలసిన మరికొన్ని విషయాలు

1. వినియోగ వివాదం చోటుచేసుకున్నదగ్గరనుండి రెండు సంవత్సరములలోపు వినియోగదారుల కోర్టులో ఫిర్యాదువేయాలి. ఒకవేళ రెండుసంవత్సరములు దాటిపోతే ఎందుకు అలస్యంజరిగిందో సరియైన కారణములు తెలుపుతూ జాప్యాన్ని మన్నించమని కోరుతూ రాతపూర్వక అభ్యర్ధన చేసుకోవాలి.

2. ఫిర్యాదుతోపాటు నిర్ణీత రుసుము చెల్లించాలి.

3. ఫిర్యాదుతోపాటు బిల్లు తదితరమైన సాక్ష్యాలు జతపరచాలి.

4. అక్రమ ఫిర్యాడు చేస్తే న్యాయస్థానం పదివేలవరకూ జరిమానా విధించవచ్చు.

5. న్యాయస్థానం విధించిన జరిమానా చెల్లించకపోతే పదివేలరూపాయలవరకు జరిమానా లేదా కారాగారవాసం తప్పదు.

6. వాయిదాలకు వెళ్ళకపోతే న్యాయస్థానం ఫిర్యాదును కొట్టివేయవచ్చు.

7. కోర్టు తీర్పును అమలుపర్చమని అడిగిన సందర్భంలో ప్రతివాది ఆస్తుల వివరములు, ఆర్.ఎస్ నెంబర్లు దరఖాస్తులో పేర్కొనవలెను.

8. తీర్పు వెలువడేలోపు తనకు నష్టం జరిగే అవకాశం వుందని భావిస్తే వినియోగదారుడు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వమని అడగవచ్చు.

9. మధ్యంతర ఉత్తర్వులు అమలుపరచకపోతే అలా అమలుపరచనివారి ఆస్తులను జప్తు చేయమని కోర్టు ఆదేశించవచ్చు.

10. న్యాయస్థానం తీర్పును ఇరు పార్టీలకు ఉచితంగా ఇవ్వాలి. తీర్పు కాపీ అందకపోతే వినియోగదారుడు దరఖాస్తు చేసుకుని పొందవచ్చు.

11. పై న్యాయస్థానానికి అప్పీల్ చేసుకోవాలనుకుంటే దిగువ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును తప్పని సరిగా అప్పీల్ కు జత చేయాలి.

12. అప్పీల్ చేసుకోవడానికి వినియోగదారుడు ఎటువంటి రుసుము చెల్లించవలసిన అవసరంలేదు.