header

Samachara Hakku

సమాచర హక్కుచట్టం
2005 అక్టోబర్ 12 నుంచి సమాచార హక్కుచట్టం అమల్లోకి వచ్చింది. భారత సుప్రీంకోర్టు ...బెన్నెట్ కాల్మాన్ కంపెనీ (1973) కేసులో ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకొనే హక్కు ఆర్టికల్ 19-(1) (ఎ) ప్రకారం పౌరుడికి గల ప్రాధమిక హక్కుల్లో అంతర్భాగమని తీర్పు చెప్పింది.

సమాచారహక్కు చట్టంలోని ముఖ్యాంశాలు

1. వివిధ ప్రభుత్వశాఖలనుంచి కావల్సిన సమాచారాన్ని పొందే హక్కు ప్రతి పౌరుడుకి ఉంటుంది.

2. పౌరుడు ఏ ప్రభుత్వ శాఖనుంచి అయినా తనకు కావల్సిన సమాచారాన్ని కోరుతూ ధరఖాస్తు చేసుకోవచ్చు

3. దరఖాస్తు ఫారంతో పాటు రూ.10- నగదు లేదా డ్రాఫ్ట్ రూపంలో చెల్లించాలి. ప్రస్తుతం రాష్ట్రంలో గ్రామస్థాయిలో ఎలాంటి ఫీజులేదు. మండలస్థాయిలో రూ.5- డివిజన్ స్థాయిలో రూ.10-చెల్లించాలి. దారిద్ర్యరేఖకు దిగువున ఉన్నవారు ఏస్థాయిలోనూ ఫీజు చెల్లించనవసరంలేదు.

4. దరఖాస్తుదారుడు కోరిన సమాచారం కోసం జెరాక్స్ కాపీలు లేదా సి.డీలకు అయ్యే ఖర్చును ఇండియన్ పోస్టల్ ఆర్డర్ లేదా డ్రాఫ్ట్ ద్వారా దరఖాస్తు ఫారంతో జతచేయాలి

5. పౌరుడు తనకు కావల్సిన రికార్డులను కూడా తనిఖీ చేసుకోవచ్చు. దీనికోసం మొదటి గంట ఎలాంటి రుసుం లేదు. తర్వాత ప్రతి 15 నిమిషాలకు రూ.5- చొప్పున చెల్లించాలి.

6. ప్రతిశాఖలో సమాచార అధికారి 30రోజుల్లో పౌరుడు అడిగిన సమాచారాన్ని అందించాలి.

7. పౌరుడు అడిగిన సమాచారాన్ని 30 రోజుల్లో ఇవ్వకుంటే రోజుకురూ.250- చొప్పున గరిష్టంగా రూ.25,000-వరకు జరిమానా, శాఖాపరమైన చర్య ఉంటుంది.

8. ఈ చట్టం అమలుకోసం కేంద్రస్థాయిలో....రాష్ట్రసమాచార కమీషన్ లు ఉంటాయి. వీటిలో ఒక ఛైర్మన్ పదిమంది సభ్యుల చొప్పున ఉంటారు.

9. ఈ చట్టంలోని సెక్షన్ 40(1)(బి) ప్రకారం చట్టం అమల్లోకి వచ్చిన 120 రోజుల్లోగా ప్రతిశాఖ తమ శాఖకు సమంబంధించిన ముఖ్యసమాచారాన్ని ప్రజలు కోరకున్నా స్వచ్ఛందంగా అందుబాటులో ఉంచాలి.

10. విచారణ సమయంలో సమాచార కమీషన్ కు సివిల్ కోర్టుకు ఉండే అధికారాలు ఉంటాయి.

సమాచారచట్టం క్రింద అడగాటానికి వీలులేనివి

దేశ సౌర్వభౌమత్వం సమగ్రత, విదేశీ సంబంధాలు దెబ్బతినే అవకాశమున్న అంశాలు, కోర్టు ధిక్కార సమాచారం, ఇంటెలిజన్స్ బ్యూరో, సైనికవ్యవహారాలు తదితర అంశాలపై సమాచారం కోరే హక్కులేదు.

సమాచారహక్కు చట్టం ఎంత సమర్ధవంతంగా అమలైతే దేశం అంతగా అభివృద్ధి చెందినట్లని కేంద్రసమాచార మాజీ ప్రధాన కమీషనర్ ఎ.ఎన్ తివారీ పేర్కొన్నారు.

సమాచారం అందకపోతే క్రిందివారికి ఫిర్యాదు చేయవచ్చు
రాష్ట్రసమాచార కమీషన్ గ్రౌండ్ ఫ్లోర్, పబ్లిక్ గార్డెన్స్ ఎదురుగా, హైదరాబాద్ 040-23230245 website : www.apic.gov.in