ఓటరు గుర్తింపు కార్డు బహుళ ప్రయోజనకారి. ఆ కార్డు ప్రభుత్వ సంబంధమైన అన్ని కార్యక్రమాలకు గుర్తింపుగా వినియోగించుకోవచ్చు. బ్యాంకు ఖాతాలు తెరవాలన్నా, పాస్‌పోర్టు, పాన్ కార్డు దరఖాస్తుకు, ప్రయాణాలు, ఆధార్ కార్డు పొందేందుకు, వయస్సు ధ్రవీకరణ, విద్యా, ఉద్యోగ అవకాశాలకు ఇది గుర్తింపుగా ఉపయోగపడుతుంది.
నూతన ఓటర్లు ఫారం-6 ను ఉపయోగించాలి కొత్త ఓటరుగా నమోదు కావటానికి వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. ఫారం-6 తో పాటు రెండు పాస్‌పోర్టు సైజ్ ఫోటోలను జతపరచాలి.
వయసుకు సంబంధించి జనన ధ్రువీకరణ పత్రం లేక తల్లి తండ్రుల అఫిడవిట్ జతపరచాలి. పేరు నమోదు కోసం పూర్తి వివరాలను ఫారంలోని గళ్ళలో నింపాలి. ఓటర్ నివాసం మారినపుడు లేక చనిపోయినపుడు ఫిర్యాదు చేయాంటే ఫారం-7ను ఉపయోగించాలి. జాబితాలో ఏమైనా మార్పు చేయానుకుంటే ఫారం-8ను ఉపయోగించాలి.
నివాసం మారి ప్రస్తుత నివాసం ఉన్న ప్రాంతాల్లో పేరు నమోదుకు ఫారం-8ఎ ను ఉపయోగించాలి. ధరఖాస్తు ఫారాు 6, 7, 8, 8- ఏ మీ నియోజకవర్గ పరిధిలోని
సబ్‌కలెక్టర్ రెవెన్యూ డివిజనల్ అధికారి లేదా తహసిల్‌దార్ కార్యాలయంలో పొందవచ్చు.లేదా
www.ceo.in or www.ceoandhra.nic.in నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
అంతర్జాలంలోనూ అవకాశం: కంప్యూటర్‌పై పరిజ్ఞానం ఉన్న వారు ఓటుహక్కు దరఖాస్తును అంతర్జాం నుండి డౌన్‌లోడ్ చేసుకోని దాని నుండే సమర్పించవచ్చు. www.ceo.ap.nic.in చేయాలి. అందులో ఈ రిజిస్టర్‌ను ఓపెన్ చేస్తే అన్ని వివరాలు లభ్యం అవుతాయి. ఓటుహక్కు దరఖాస్తు ఫారం-6ను ఇక్కడనుండే డౌన్‌లోడ్ చేసుకొని తిరిగి అదే చిరునామాకు పంపాలి.
రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి ఆ దరఖాస్తును పరిశీలించి సంబంధిత అధికారికి పంపుతారు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఓటుహక్కు నమోదు అవుతుంది.ఇంటివద్ద నుంచే ఓటుహక్కు, జాబితాలో మార్పు, సవరణకు ఇలా దరఖాస్తు చేయవచ్చు. పూర్తి వివరాలకు ఈ క్రింది వెబ్ సైట్ లను చూడండి
www.ceo.in and www.ceo.ap.in