
** స్తంభన లోపంతో వచ్చే దాదాపు అందరిలోనూ మధుమేహం, అధిక రక్తపోటు వంటి సమస్యలు ఉంటాయి. అంగానికి రక్తసరఫరా కొద్దిగా తగ్గిన వారిలో అంగం స్తంభిస్తుంది కానీ ఎక్కువసేపు గట్టిగా ఉండలేదు. ఇలాంటి వాళ్లు ఎలాగోలా భాగస్వామితో నెట్టుకొస్తుంటారు. మన దేశంలో స్త్రీలు శృంగారంలో తృప్తి పొందలేకపోయినా దాన్ని మనసులోనే దాచుకోవటంలో, సహకరించటంలో ముందుంటారు. అయితే ఈ పరిస్థితి వేగంగా మారుతోంది. ఆధునిక మహిళలు సెక్స్ విషయాల్లోనూ అవగాహన కలిగి ఉంటున్నారు. ఇప్పుడు ఎంతోమంది భార్యలే భర్తలను వైద్యుల వద్దకు తెస్తున్నారు కూడా.
** గుండెలోని రక్తనాళాలు 80% మూసుకుపోయినా.. చాలామంది బాగానే ఉంటారు, బండి నెట్టుకొస్తుంటారు. కానీ పురుషాంగంలోని రక్తనాళాలు అలా కాదు. అవి చాలా సున్నితమైనవి, కొంత వరకూ ఫర్వాలేదుగానీ అది ఇంకా ముదిరితే దాన్ని చక్కదిద్దటం కష్టం. అందుకే ఒకసారి స్తంభన లోపం వచ్చిన తర్వాత... హైబీపీ, మధుమేహం వంటివాటిని అదుపులో ఉంచుకుంటున్నప్పటికీ స్తంభన లోపం పూర్తిగా తగ్గుతుందని చెప్పటం కష్టం. కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవటం, వ్యాయామం చేయటం వంటి వాటి ద్వారా చాలా కొద్దిమేరకు ఫలితం ఉండొచ్చు. ఇలాంటి జాగ్రత్తలు ఆ లోపాన్ని మరింత ముదరకుండా చేస్తాయి.
** యువకుల్లో ఏర్పడే స్తంభన లోపాన్ని తొలిదశలోనే గుర్తించి, జీవనశైలి మార్పులతో జాగ్రత్త పడితే ఆ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంది.
శృంగారం, సంభోగం విషయంలో ఏదైనా ఇబ్బంది ఉంటే మన దేశంలో పురుషులు దాన్ని అంగీకరించటానికి ముందుకు రావటం లేదు. దాన్ని స్త్రీల మీదికి నెట్టటానికే ప్రయత్నిస్తుంటారు. ఇలా చెయ్యటం వల్ల వారిలో సమస్యలను ముందే పట్టించుకునే అవకాశం లేకుండా పోతోందని మర్చిపోకూడదు.
** పొగ, మద్యం మానెయ్యటం.. శారీరక శ్రమ చేయటం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం వంటి వాటివల్ల శరీరంలోని అన్ని భాగాలకు రక్త సరఫరా మెరగవుతుంది. గుండె రక్తనాళాల పనితీరూ బాగుంటుంది. తగినంత విశ్రాంతి తీసుకోవటం, ఒత్తిడిని తగ్గించుకోవటం కూడా ఉపయోగపడతాయి.
చిచి జీవనశైలి మార్పులతో భాగస్వామితో సంబంధాలు కూడా మెరగవుతాయి. కేవలం సంభోగం విషయంలోనే కాదు సాన్నిహిత్యం పెరగటానికీ తోడ్పడతాయి.