సుఖవ్యాధులకు కారణమయ్యే సూక్ష్మక్రిములు ఒంట్లో ప్రవేశించినా వెంటనే లక్షణాలు కనబడాలనేం లేదు. ఉదాహరణకు హెర్పిస్ సింప్లెక్స్ సంక్రమిస్తే 3 రోజుల్లోనే లక్షణాలు బయటపడతాయి. కానీ షాంక్రాయిడ్ లక్షణాలు 5-8 రోజుల్లో, సిఫిలిస్ లక్షణాలు 9 రోజుల తర్వాత మొదలవుతాయి. అదే లింఫో గ్రాన్యులోమా వెనీరియం (ఎల్‌జీవీ) లక్షణాలు బయటపడటానికి దాదాపు 3-4 వారాలు పడుతుంది. అలాగే గ్రాన్యులోమా వెనీరియం (జీవీ) లక్షణాలు 90 రోజుల తర్వాత కూడా కనబడొచ్చు. కాబట్టి సుఖవ్యాధుల విషయంలో అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం.
.
సంభోగం ద్వారా వ్యాపించే మరో తీవ్రమైన సమస్య జననాంగ పులిపిర్లు. దీనికి మూలం హ్యూమన్ పాపిలోమా వైరస్. దీనివల్ల జననాంగాలు, మలద్వారం వద్ద పులిపిర్ల వంటివి మొలుస్తుంటాయి. చూడటానికి సాధారణ పులిపిర్లలాగే ఉన్నా నొక్కితే మెత్తగా ఉంటాయి. వైరస్ సంక్రమించిన 3 వారాలకే పులిపిర్లు మొదలవ్వచ్చు, కొన్నిసార్లు నెలల తర్వాత రావచ్చు. వీటితో పెద్ద నొప్పి, బాధలేం ఉండవు కాబట్టి చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ వీటివల్ల జననాంగాలు వికారంగా కనిపించటం మొదవుతుంది.
కరెంట్, మందులు, లేజర్ వంటి పద్ధతులతో ఈ పులిపిర్లను తొలగిస్తారు. రోగనిరోధకశక్తి తగ్గినవారికి, పులిపిర్లు మూత్రమార్గంలోనూ వచ్చి తీవ్రంగా బాధపడుతున్న వారికి యాంటీవైరల్ మందులతో చికిత్స అవసరం.
ని
పులిపిర్లతో ఆయా భాగాలు వికారంగా తయారవుతాయి. వీరి నుంచి వైరస్ ఇతరులకు వ్యాపిస్తుంది. ఒకోసారి ఇన్‌ఫెక్షన్‌తో దుర్వాసన మొదలవ్వచ్చు. అరుదుగా మెదడు పొరల్లో వాపు రావొచ్చు. గర్భిణుల నుంచి ఈ వైరస్ పిండానికీ వ్యాపించొచ్చు. దీంతో పిల్లల నోట్లో పాపిలోమాస్, బరువు తక్కువగా పుట్టటం, మెదడు పొరల్లో వాపు వంటివే కాదు.. అరుదుగా మృత శిశువులూ పుట్టొచ్చు.