header

Sex verses Ages

దాంపత్య జీవితంలో ఎదురయ్యే అనేక సందేహాలు/సమస్యలు/సుఖఃరోగాలు వీటన్నిటిని గురించిప్రఖ్యాత వైద్యుల వివరణ...
వీటిని గురించి వివరించటం మాత్రమే జరిగింది....వాటిని అనుసరించేముందు అనుభవజ్ఙులైన వైద్యుల సలహా తప్పనిసరిగా తీసుకోవటం మంచిది. సొంతవైద్యం పనికిరాదు. ఇందులోని వివరాలు కేవలం అవగాహనకొరకు మాత్రమే


సందేహాలు...........డాక్టర్ సుధాకర్ కృష్ణమూర్తి....


వయసు పెరిగే కొద్దీ లైంగిక వాంఛలు, సెక్స్‌ మీద ఆసక్తి తగ్గిపోతాయా?

ఇది పూర్తిగా అపోహే! వందేళ్లు దాటిన వారిలో కూడా లైంగికపరమైన ఆసక్తులు చచ్చిపోతాయనుకోవటానికి లేదు. దీనిపై ప్రపంచ వ్యాప్తంగా అధ్యయనాలు, పరిశోధనలు చాలానే జరిగాయి. మనుషులు మరణించే వరకూ కూడా లైంగికంగా ఆసక్తులయ్యే ఉంటారని వీటిలో స్పష్టంగా గుర్తించారు. కాకపోతే యుక్తవయసులో ఉండే ఆసక్తీ.. మలివయసులో ఉండే ఆసక్తీ ఒకే రకంగా ఉండదు. యుక్తవయసులో ఉన్న వారిలా మలి వయసులో రోజుకోసారి సంభోగం వంటివి సాధ్యం కాకపోవచ్చు. కానీ స్త్రీపురుషుల మధ్య సాన్నిహిత్యానికి ఉండే ప్రాముఖ్యం మాత్రం మనిషి మరణించే వరకూ కూడా తగ్గదు. కేవలం చేయి పట్టుకోవటమే కావచ్చు... అది కేవలం సాన్నిహిత్య భావనే కావచ్చు.. కానీ దానికీ ప్రాధాన్యం ఉంటుంది. కాబట్టి వయసుతో పాటు సెక్స్‌ వాంఛల, కోరికల రూపం మారొచ్చేమోగానీ ఆసక్తి తగ్గిపోవటమన్నది మాత్రం ఉండదు.