చాలామంది సంక్రమించవనే చెబుతుంటారుగానీ వాస్తవానికి కొన్నిరకాల సుఖవ్యాధులు, ముఖ్యంగా చర్మవ్యాధులు సంక్రమించే అవకాశం లేకపోలేదు. టాయ్‌లెట్ సీట్ల ద్వారా సిఫిలిస్ క్రిములు, గోనోకోకల్ బ్యాక్టీరియా వంటివి ఒకరి నుంచి మరొకరికి సంక్రమించేంతటి పరిస్థితి ఉండదు గానీ.. చర్మవ్యాధుల వంటివి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి టాయ్‌లెట్ సీట్ల ద్వారా ముప్పు తక్కువనే చెప్పొచ్చు. అయితే అస్సలు ముప్పు ఉండదని చెప్పటం మాత్రం కష్టం.