header

About G Spot

దాంపత్య జీవితంలో ఎదురయ్యే అనేక సందేహాలు/సమస్యలు/సుఖఃరోగాలు వీటన్నిటిని గురించిప్రఖ్యాత వైద్యుల వివరణ...
వీటిని గురించి వివరించటం మాత్రమే జరిగింది....వాటిని అనుసరించేముందు అనుభవజ్ఙులైన వైద్యుల సలహా తప్పనిసరిగా తీసుకోవటం మంచిది. సొంతవైద్యం పనికిరాదు. ఇందులోని వివరాలు కేవలం అవగాహనకొరకు మాత్రమే


సందేహాలు...........డాక్టర్ సుధాకర్ కృష్ణమూర్తి....


‘జీ’ స్పాట్‌ను ప్రేరేపిస్తే స్త్రీలకు భావప్రాప్తి కలుగుతుందా?

కలగాలనేం లేదు. నిజానికి చాలామందికి ‘జీ స్పాట్‌’ ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు. అసలు ‘జీ స్పాట్‌’ ఉందా? లేదా? అన్నదానిపైనా శాస్త్రవేత్తల్లో బోలెడు చర్చలున్నాయి. అయితే యోని లోపల.. ముందువైపు గోడ పైభాగంలో నాడీ చివళ్లన్నీ ఒకేచోట కేంద్రీకృతమైన ప్రాంతం ఒకటి ఉంటుంది. దీన్ని మొదటగా గ్రిఫెన్‌బర్గ్‌ అనే శాస్త్రవేత్త గుర్తించాడు, ఆయన పేరుతోనే ‘జీ- స్పాట్‌’ అంటున్నారు. నాడీ చివళ్లు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతం ప్రేరేపితమైతేఎంతో గాఢమైన లైంగిక తృప్తి కలుగుతుందని కొందరు వాదించినా నిజంగా దీనికి అంతటి ప్రభావం ఉందా? లేదా? అన్న దానిపై పూర్తి స్పష్టత లేదు. అయితే ఒకటి మాత్రం సుస్పష్టం. యోని పైభాగాన చిన్న బుడిపెలా ఉండే యోనిశీర్షానికి (క్లిటోరిస్‌) మాత్రం శృంగారానుభవాన్ని ఇనుమడింపజేసే గుణం ఉంది. ఒకరకంగా పురుషులకు ఉండే శిశ్నం వంటిదే స్త్రీలలోని ఈ యోనిశీర్షం కూడా. సంభోగ సమయంలో పురుషాంగం దీన్ని తాకినా, దీనికి రుద్దుకున్నా స్త్రీకి అనిర్వచనీయమైన శృంగానుభవం, ఆనందం కలుగుతాయి. కేవలం దీన్ని రుద్దుకోవటం ద్వారానే భావప్రాప్తి కలిగే సందర్భాలూ ఉంటాయి.