header

Pregrancy doubts

దాంపత్య జీవితంలో ఎదురయ్యే అనేక సందేహాలు/సమస్యలు/సుఖఃరోగాలు వీటన్నిటిని గురించిప్రఖ్యాత వైద్యుల వివరణ...
వీటిని గురించి వివరించటం మాత్రమే జరిగింది....వాటిని అనుసరించేముందు అనుభవజ్ఙులైన వైద్యుల సలహా తప్పనిసరిగా తీసుకోవటం మంచిది. సొంతవైద్యం పనికిరాదు. ఇందులోని వివరాలు కేవలం అవగాహనకొరకు మాత్రమే


సందేహాలు...........డాక్టర్ సుధాకర్ కృష్ణమూర్తి....


స్ఖలనానికి కొద్ది ముందు అంగాన్ని బయటకు తీసెయ్యటం ద్వారా గర్భం రాకుండా చూసుకోవచ్చా?

కచ్చితంగా చెప్పలేం. గర్భనిరోధం కోసం చాలామంది ఈ పద్ధతి పనికొస్తుందని భావిస్తుంటారు, దీనికి వైద్యపరంగా ‘కాయిటస్‌ ఇంటరప్టస్‌’ అనే పేరు కూడా ఉందిగానీ.. నిజానికి ఇది సమర్థమైన గర్భనిరోధక విధానం కాదు. ఎందుకంటే స్ఖలనం జరిగి వీర్యం బయటకు రావటమన్నది సంభోగం చివ్వరే జరగొచ్చుగానీ.. అంతకు ముందు సంభోగం కొనసాగుతున్నంత సేపూ కూడా పురుషాంగం నుంచి కొన్ని స్రావాలు వస్తూనే ఉంటాయి. ఈ స్రావాల ద్వారా కూడా కొన్ని శుక్రకణాలు యోనిలోకి చేరిపోవచ్చు. కాబట్టి గర్భనిరోధానికి ఇది నమ్మదగ్గ పద్ధతి కానేకాదు. పైగా భావప్రాప్తికి చేరువయ్యే ఆ సమయంలో పురుషుడు నియంత్రించుకోవటం, సంభోగాన్ని ఆపెయ్యటమంటే అంత సులభంగా అయ్యేదీ కాదు, దానివల్ల సరైన శృంగార సౌఖ్యమూ దక్కదు. కాబట్టి సమర్థమైన ఇతర పద్ధతులను అనుసరించటం ఉత్తమం.