header

Sex Enjoyment

దాంపత్య జీవితంలో ఎదురయ్యే అనేక సందేహాలు/సమస్యలు/సుఖఃరోగాలు వీటన్నిటిని గురించిప్రఖ్యాత వైద్యుల వివరణ...
వీటిని గురించి వివరించటం మాత్రమే జరిగింది....వాటిని అనుసరించేముందు అనుభవజ్ఙులైన వైద్యుల సలహా తప్పనిసరిగా తీసుకోవటం మంచిది. సొంతవైద్యం పనికిరాదు. ఇందులోని వివరాలు కేవలం అవగాహనకొరకు మాత్రమే


సందేహాలు...........డాక్టర్ సుధాకర్ కృష్ణమూర్తి....

సెక్స్‌ ను స్త్రీల కంటే పురుషులే ఎక్కువగా ‘ఎంజాయ్‌’ చేస్తారా?

ఇదేం నిజం కాదు. ఇదో పురుషాహంకార భావన. సంభోగాన్ని స్త్రీపురుషులు ఇరువురూ సమాన స్థాయిలోనే ఆస్వాదిస్తారు. అయితే పురుషుల ప్రవర్తన, వ్యవహార శైలి కాస్త బాహాటంగా, నాటకీయంగా ఉండి, వాళ్లు సెక్స్‌ని ఎక్కువగా ‘ఎంజాయ్‌’ చేస్తున్నట్టు అనిపించొచ్చు. అదే స్త్రీల విషయానికి వచ్చేసరికి ఈ వ్యక్తీకరణలు కాస్త మృదువుగా, నిదానంగా, సున్నితంగా అనిపించొచ్చుగానీ..
వాస్తవానికి స్త్రీలు పురుషుల కంటే భావప్రాప్తిలో గాఢమైన అనుభూతి పొందుతారు. పైగా స్త్రీలు సంభోగ సమయంలో ఒకసారి కాదు.. పలుమార్లు భావప్రాప్తి పొందొచ్చు కూడా. అదే పురుషుల్లో ఒక్కసారి స్ఖలనం అయిపోయిందంటే అంగం బిగువు కోల్పోతుంది, సెక్స్‌ వాంఛా తీరిపోతుంది. నిజానికి ఇది సంతాన వృద్ధి కోసం ఉన్న ఏర్పాటు. ఎందుకంటే పురుషుడు స్ఖలించిన వీర్యం.. అందులోని శుక్రకణాలు.. ఎక్కడో పైన ఫలోపియన్‌ ట్యూబుల వద్ద ఉండే అండం వరకూ చేరుకుంటేనే సంయోగం, గర్భధారణ సాధ్యమవుతాయి.
ఒకవేళ స్ఖలనం తర్వాత కూడా పురుషుడు సంభోగాన్ని కొనసాగిస్తూనే ఉంటే అది ఈ అండ-శుక్ర సంయోగ ప్రక్రియకు అవరోధంగా మారొచ్చు. అందుకే స్ఖలనంతో సాధారణంగా సంభోగం ముగుస్తుంది. సంభోగంలో స్త్రీలు పలుమార్లు భావప్రాప్తి పొందినా, పురుషులు ఒక్కసారే పొందినా... సెక్సును ఇద్దరూ సమానంగానే ఆస్వాదిస్తారు. ఇరువురూ తృప్తిని పొందుతారు. ఇందులో ఒకరు ఎక్కువనీ, మరొకరు తక్కువనేం ఉండదు.