కచ్చితంగా కాదు. పైగా ఆమె తృప్తి కలగకపోయినా కలిగినట్టు నటిస్తోందని చెప్పటానికి (ఫేకింగ్) ఇదో సంకేతం. నిజానికి సంభోగ సమయంలో, ముఖ్యంగా భావప్రాప్తిని పొందే క్రమంలో స్త్రీలు చిన్నచిన్న సవ్వడులు, నిట్టూర్పులు, మూలుగుల వంటి ధ్వనులు చెయ్యటం సహజమే. కానీ నీలిచిత్రాల్లో వీటిని చాలా ఎక్కువ చేసి చూపిస్తుంటారు. నిజ జీవితంలో ఈ సమయంలో స్త్రీలు చేసే సున్నిత ధ్వనులకూ, ఈ చిత్రాల్లో చూపించే వాటికీ ఏమాత్రం పోలిక ఉండదనే చెప్పొచ్చు. మొత్తానికి భావప్రాప్తి సమయంలో చిన్నచిన్న ధ్వనులు చెయ్యటమన్నది ఆమె అనుభవిస్తున్న భావోద్వేగానికి ప్రతిస్పందన వంటిదే, ఇది సహజం.